శరీరము నందు ఏర్పడు కొవ్వు గురించి విశేషాలు
👁️🗨️ కొవ్వు శరీరం యొక్క ఉష్ణోగ్రత క్రమబద్ధీకరిస్తుంది
◾కొవ్వులో రెండు రకాలు ఉన్నాయి.
• శాచురేటేడ్ ఫాట్.
• అన్ శాచురేటెడ్ ఫాట్.
💠 శాచురేటెడ్ ఫాట్ సాధారణముగా రూము ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టిపోతుంది. ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాట్స్ జంతుసంబంధ ఆహారంలో ఉంటాయి. మాంసం , చికెన్ , పాలు , వెన్న , గుడ్లు మొదలైన వాటిలో కొబ్బరినూనె , పామాయిల్ వంటి వృక్ష సంబంధ ఆహారంలో కూడా శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి.
💠 అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టకుండా ద్రవస్థితిలోనే ఉంటుంది. ఇది ఎక్కువుగా వృక్షసంబంధ ఆహారంలో లభించును. వేరుశెనగ నూనె , నువ్వులనూనె , ఆలివ్ ఆయిల్ , సన్ ఫ్లవర్ ఆయిల్ , సోయాబిన్ ఆయిల్ మొదలయిన వాటిలో ఉండును.
మనం తిన్న ఆహారంలో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటే వాటిని కాలేయం కొలెస్ట్రాల్ కింద మార్చును.
💠 ఆహారంలో మీరెంత శాచురేటెడ్ ఫ్యాట్ తీసుకుంటే అంత ఎక్కువుగా మీ రక్తములో కొలెస్ట్రాల్ శాతం పెరిగి గుండెకి రక్తాన్ని తీసుకొనివెళ్లే కరొనరీ ధమనుల లోపలి గోడల మీద నిలువ అవుతాయి. అప్పుడు ధమని ఇరుకుగా అయ్యి గుండెజబ్బులకు , గుండెపోటుకు దారి తీయును .
కొలెస్ట్రాల్ అనేది మన శరీరపు టిష్యూస్ మధ్య ఏర్పడే మైనంలా తెల్లగా ఉండే కొవ్వులాంటి పదార్థం.
💠 శరీరంలో కొలెస్ట్రాల్ అవసరం ఎంతో ఉంటుంది. కొలెస్ట్రాల్ అడ్రెనాల్ గ్రంధులలోను , పురుషుల వృషణాలలోను , స్త్రీల అండాశయాలలోను నిలువ అయ్యి "steroid harmons " కింద మార్పు చెందటానికి ఉపకరించును.
💠 కొలెస్ట్రాల్ పిత్తరసం ( bile ) తయారీకి ఉపయోగపడును. ఆహారం జీర్ణం అవ్వడానికి ముఖ్యముగా ఆహారంలో కొవ్వు పదార్ధాలు జీర్ణం అవ్వడానికి పిత్తరసం ( Bile ) అవసరం ఉండును.
కొవ్వు నరాల చుట్టూ ఇన్సులేషన్ లా ఉపయోగపడటమే కాకుండా శరీరపు మిగతా అవసరాలకు ఉపయోగపడును.
💥 30 సంవత్సరాల లోపు మనిషిలో కోలెస్ట్రాల్ 150 m/g dl లోపల ఉండాలి .
💥 30 సంవత్సరాల పైన ఉన్న మనిషిలో కొలెస్ట్రాల్ 180 m/g dl లోపల ఉండవలెను .
💥 ఏ వ్యక్తిలోనైనా కోలెస్ట్రాల్ 200 m/g dl మించి ఉండరాదు.
0 Comments