GET MORE DETAILS

రాశి ఫలితాలు: ఆదివారం (29-12-2024)

రాశి ఫలితాలు: ఆదివారం  (29-12-2024)
🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈



మేషం:

అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.  భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వృషభం:

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సంతాన విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.

మిధునం:

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. నూతన రుణయత్నాలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప  అనారోగ్య సమస్యలుంటాయి.

కర్కాటకం:

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి.

సింహం:

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. నూతన వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం  ఉంటుంది.

కన్య:

నూతన రుణయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలలో వాయిదా పడుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం.

తుల:

ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు పాటిస్తారు. సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి.

వృశ్చికం:

ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

ధనస్సు:

_నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. మీ నిర్ణయాలు అందరికి నచ్చేవిధంగా ఉంటాయి. వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తాయి. పనులు చకచకా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి.

మకరం:

సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్త్ర వస్తులాభాలు పొందుతారు. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమౌతాయి.

కుంభం:

సన్నిహితులతో విభేదాలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి పాత ఋణలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబంలో కొందరి మాటలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

మీనం:

చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరంగా సమస్యలు తప్పవు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం దైవ చింతన కలుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.


సర్వేజనా సుఖినోభవంతు-శుభమస్తు.

Post a Comment

0 Comments