Ads Area

డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణ పథకాలు

0

 డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణ పథకాలు 



డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా కూటమి ప్రభుత్వం రెండు కొత్త పథకాలు – ఎన్టీఆర్ విద్యాలక్ష్మి & ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి త్వరలో అమల్లోకి


పిల్లల చదువులకు – ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం

1. గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు వర్తింపు

2. రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణ సాయం

3. పాఠశాల/కళాశాల ఫీజులకు అనుగుణంగా మొత్తం

4. 4% వడ్డీ (పావలా వడ్డీ)తో రుణం

5. గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లింపు

6. అడ్మిషన్ లెటర్, ఫీజు రసీదులు సమర్పణ తప్పనిసరి

7. 48 గంటల్లో సభ్యురాలి బ్యాంక్ ఖాతాలో నగదు జమ


ఆడబిడ్డల పెళ్లికి – ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకం

1. సభ్యురాలి కుమార్తె వివాహానికి వర్తింపు

2. రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణ సాయం

3. 4% వడ్డీ (పావలా వడ్డీ)తో రుణం

4. గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లింపు

5. లగ్నపత్రిక, పెళ్లి ఖర్చు పత్రాలు సమర్పణ

6. వివాహ వివరాల పరిశీలన అనంతరం ఖాతాలో నగదు జమ


ఎవరికీ వర్తింపు?

1. డ్వాక్రా సంఘంలో కనీసం 6 నెలల సభ్యత్వం ఉన్నవారికి

2. ఇప్పటికే తీసుకున్న అప్పులు చెల్లిస్తున్నవారికి

3. బయోమెట్రిక్ ఆధారంగా అమలు


భారీ వ్యయం – రూ.2000 కోట్లు

1. ప్రతి ఏడాది రూ.1000 కోట్లు చొప్పున – మొత్తం రూ.2000 కోట్లు

2. రుణాలపై సమకూరే ఆదాయంలో 50% – మండల/గ్రామ సమాఖ్యల బలోపేతానికి

3. మిగతా 50% – స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు

☛ సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే – తీసుకున్న రుణం మాఫీ

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area