GET MORE DETAILS

నేటి నుండి మూడు రోజులు దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా)

నేటి నుండి మూడు రోజులు దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా)



శ్రీ దుర్గా అష్టోత్తర శత నామావళి


ఓం దుర్గాయై నమః

ఓం శివాయై నమః

ఓం మహాలక్ష్మ్యై నమః

ఓం మహాగౌర్యై నమః

ఓం చండికాయై నమః

ఓం సర్వజ్ఞాయై నమః

ఓం సర్వాలోకేశాయై నమః

ఓం సర్వకర్మఫలప్రదాయై నమః

ఓం సర్వతీర్ధమయ్యై నమః

ఓం పుణ్యాయై నమః (10)

ఓం దేవయోనయే నమః

ఓం అయోనిజాయై నమః

ఓం భూమిజాయై నమః

ఓం నిర్గుణాయై నమః

ఓం ఆధారశక్త్యై నమః

ఓం అనీశ్వర్యై నమః

ఓం నిర్గుణాయై నమః

ఓం నిరహంకారాయై నమః

ఓం సర్వగర్వ విమర్దిన్యై నమః

ఓం సర్వలోకప్రియాయై నమః (20)

ఓం వాణ్యై నమః

ఓం సర్వవిద్యాధి దేవతాయై నమః

ఓం పార్వత్యై నమః

ఓం దేవమాత్రే నమః

ఓం వనీశాయై నమః

ఓం వింధ్యవాసిన్యై నమః

ఓం తేజోవత్యై నమః

ఓం మహామాత్రే నమః

ఓం కోటిసూర్య సమప్రభాయై నమః

ఓం దేవతాయై నమః (30)

ఓం వహ్నిరూపాయై నమః

ఓం సతేజసే నమః

ఓం వర్ణరూపిణ్యై నమః

ఓం గుణాశ్రయాయై నమః

ఓం గుణమధ్యాయై నమః

ఓం గుణత్రయ వివర్జితాయై నమః

ఓం కర్మజ్ఞానప్రదాయై నమః

ఓం కాంతాయై నమః

ఓం సర్వసంహార కారిణ్యై నమః

ఓం ధర్మజ్ఞానాయై నమః (40)

ఓం ధర్మనిష్ఠాయై నమః

ఓం సర్వకర్మ వివర్జితాయై నమః

ఓం కామాక్ష్యై నమః

ఓం కామసంహర్త్ర్యై నమః

ఓం కామక్రోధ వివర్జితాయై నమః

ఓం శాంకర్యై నమః

ఓం శాంభవ్యై నమః

ఓం శాంతాయై నమః

ఓం చంద్రసుర్యాగ్ని లోచనాయై నమః

ఓం సుజయాయై నమః (50)

ఓం జయభూమిష్ఠాయై నమః

ఓం జాహ్నవ్యై నమః

ఓం జనపూజితాయై నమః

ఓం శాస్త్ర్యై నమః

ఓం శాస్త్రమయ్యై నమః

ఓం నిత్యాయై నమః

ఓం శుభాయై నమః

ఓం చంద్రార్ధమస్తకాయై నమః

ఓం భారత్యై నమః

ఓం భ్రామర్యై నమః (60)

ఓం కల్పాయై నమః

ఓం కరాళ్యై నమః

ఓం కృష్ణ పింగళాయై నమః

ఓం బ్రాహ్మ్యై నమః

ఓం నారాయణ్యై నమః

ఓం రౌద్ర్యై నమః

ఓం చంద్రామృత పరిస్రుతాయై నమః

ఓం జ్యేష్ఠాయై నమః

ఓం ఇందిరాయై నమః

ఓం మహామాయాయై నమః (70)

ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః

ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః

ఓం కామిన్యై నమః

ఓం కమలాలయాయై నమః

ఓం కాత్యాయన్యై నమః

ఓం కలాతీతాయై నమః

ఓం కాలసంహారకారిణ్యై నమః

ఓం యోగనిష్ఠాయై నమః

ఓం యోగిగమ్యాయై నమః

ఓం యోగిధ్యేయాయై నమః (80)

ఓం తపస్విన్యై నమః

ఓం జ్ఞానరూపాయై నమః

ఓం నిరాకారాయై నమః

ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః

ఓం భూతాత్మికాయై నమః

ఓం భూతమాత్రే నమః

ఓం భూతేశ్యై నమః

ఓం భూతధారిణ్యై నమః

ఓం స్వధాయై నమః

ఓం నారీ మధ్యగతాయై నమః (90)

ఓం షడాధారాధి వర్ధిన్యై నమః

ఓం మోహితాంశుభవాయై నమః

ఓం శుభ్రాయై నమః

ఓం సూక్ష్మాయై నమః

ఓం మాత్రాయై నమః

ఓం నిరాలసాయై నమః

ఓం నిమ్నగాయై నమః

ఓం నీలసంకాశాయై నమః

ఓం నిత్యానందాయై నమః

ఓం హరాయై నమః (100)

ఓం పరాయై నమః

ఓం సర్వజ్ఞానప్రదాయై నమః

ఓం అనంతాయై నమః

ఓం సత్యాయై నమః

ఓం దుర్లభరూపిణ్యై నమః

ఓం సరస్వత్యై నమః

ఓం సర్వగతాయై నమః

ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః (108)


ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గాదేవి అలంకరణ

ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి)  శ్రీ దుర్గాదేవి అమ్మవారి అలంకరణ (కుజ + రాహు) ఎరుపు చీర (కుజుడు , బుధుడు) పేలాలు పాయసం నైవేద్యం (రాహువు , శుక్రుడు , చంద్రుడు)

దుర్గే దుర్గతి నాశిని..ఓం శ్రీ దుర్గా దేవ్యై నమః.

శ్లోకం: సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే , శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే.

దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి , ఎర్రటి అక్షతలు , ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి.

ఈ  శ్లోకం  చాలా  శక్తిమంతమయిన  శ్లోకం. దుర్గాదేవికి  సంభందించిన 32 నామాలు  ఇందులో  ఉన్నాయి.  ఈ  శ్లోకం  దుర్గాసప్తసతి  లో  కనిపిస్తుంది. ఈ  శ్లోకాన్ని ఎవరు   రోజూ  చదువుతారో  వారు  అన్ని భయాలనుంచీ    కష్ఠాలనుంచీ  విముక్తులవుతారు.  అందరూ  తప్పకుండా  నమ్మకం  తో  చదవండి..

శ్రీ దుర్గా ద్వా త్రిశం నామ మాల స్తోత్రం

దుర్గా దుర్గార్తి  శమనీ   దుర్గాపద్వినివారిణీ

దుర్గమచ్ఛేదినీ  దుర్గసాధినీ  దుర్గనాశినీ

ఓం దుర్గతోద్ధారిణీ   దుర్గనిహంత్రీ   దుర్గమాపహా 

ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక   దవానలా

ఓం దుర్గ  మాదుర్గమాలోకా   దుర్గమాత్మ  స్వరూపిణీ

ఓం దుర్గమార్గప్రదా   దుర్గమవిద్యా  దుర్గమాశ్రితా

ఓం దుర్గమ  జ్ఞాన  సంస్థానా  దుర్గమ  ధ్యాన  భాసినీ

ఓం దుర్గ  మోహా దుర్గమదా  దుర్గామాత స్వరూపిణీ

ఓం దుర్గ  మాసుర  సంహార్త్రీ    దుర్గమాయుధధారిణీ

ఓం దుర్గమాంగీ  దుర్గమాతా  దుర్గమ్యా దుర్గమేశ్వరీ

ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా  దుర్గ  దారిణీ

నామావళి   మిమాం  యస్తు దుర్గాయా  మమ మానవః

 పఠేత్సర్వ  భయాన్ముక్తో  భవిష్యతి  నసంశయః..

పటించవలసిన మంత్రములు

దుర్గాష్టకం

ఉద్వపయతునశ్శక్తి - మాదిశక్తే ద్దరస్మితమ్‌

తత్వం యస్యమాహత్సూక్ష్మం - మానన్దోవేతి సంశయః


జ్ఞాతుర్ఞానం స్వరూపం - స్యాన్నగుణోనాపి చక్రియా

యదిస్వ స్య స్వరూపేణ - వైశిష్య్యమనవస్దీతిః


దుర్గే భర్గ సంసర్గే - సర్వభూతాత్మవర్తనే

నిర్మమేనిర్మలేనిత్యే - నిత్యానందపదేశివా!


శివాభవాని రుద్రాణి - జీవాత్మపరిశోధినీ!

అమ్బా అమ్బిక మాతంగీ - పాహిమాం పాహిమాం శివా


దృశ్యతేవిషయాకారా - గ్రహణే స్మరణే చధీః

ప్రజ్ఞావిషయ తాదాత్మ్య - మేవం సాక్షాత్‌ ప్రదృశ్యతే


పరిణామో యథా స్వప్నః - సూక్ష్మస్యస్థూలరూపతః

జాగ్రత్‌ ప్రపఞ్చ ఏషస్యా -త్తథేశ్వర మహాచితః


వికృతి స్సర్వ భూతాని - ప్రకృతిర్దుర్గదేవతా

సతః పాదస్తయోరాద్యా - త్రిపాదీణియతేపరా!


భూతానామాత్మనస్సర్గే - సంహృతౌచతథాత్మని

ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా - సఙ్కల్పానారా యథామతిః


ఫలశృతి

యశ్చాష్టక మిదం పుణ్యం - పాత్రరుత్థాయ మానవః

పఠేదనన్యయా భక్త్యా - సర్వాన్కామానవాప్నుయాత్‌

8 పర్యాయములు స్మరించవలెను.  పై మంత్రము సాద్యము కానీ వారు ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రమును 108 జపించవలెను.

ఎవరు చెయ్యాలి ? ఎందుకు చెయ్యాలి ? ఎలా చెయ్యాలి ?

ఈ రోజు అమ్మవారిని సశాస్త్రీయముగా పూజించడము వలన జాతకములలోని కుజ , రాహు క్షీణ - నీచ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గును. తద్వారా ఆకస్మిక గండములనుండి విముక్తి కల్గును.

వైవాహిక సమస్యలు తొలగి కుటుంబములో కలతలు తగ్గుతాయి.

రాహు గ్రహము వలన ఏర్పడిన వ్యసనముల నుండి విముక్తి లభించు అవకాశము కలదు.

తీవ్రమైన మానసిక ఆందోళనతో బాదపడుట - డిప్రెషన్ - భయము - ఉన్మాదము వంటి సమస్యల నుండి ఉపశమనము లబించే అవకాశము ఉన్నది

ఎందుకనగా వీటన్నింటికి కారణం వారి వారి జాతకములలోని చంద్ర , కుజ , రాహు గ్రహముల ప్రభావమే అని ఘంటా పదముగా చెప్పవచ్చు. ఇటువంటి సమస్యలున్న వారు ఈ రోజు దుర్గా దేవి ని సశాస్త్రీయం గా పూజించుట అత్యంత శ్రేష్ట దాయకము.

అనవసర ధన వ్యయం ( శుక్ర , చంద్ర , కుజ ) తగ్గును.

వివాహము ఆలస్యములు తొలగి సకాలములో వివాహము జరుగును.

(30.09.25) నుండి మూడు రోజులు దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా)

దుర్గాష్టమి

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు' అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో *చివరి మూడురోజులు దుర్గాష్టమి , మహర్నవమి , విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ , శ్రామికులు పనిముట్లపూజ , క్షత్రియులు ఆయుధపూజ చేసి , అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో , పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.

దుర్గాష్టమి

దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని , అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయితి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే ? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం , దుర్భిక్షం , దుర్వ్యసనం , దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపచేసేది", అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు , భూత , ప్రేత , పిశాచ , రక్కసుల బాధలు దరిచేరవు , చేరలేవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను , తదుపరి మూడురోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను , చివరి మూడురోజులు సరస్వతిరూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని , ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆతల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు దుర్గసహస్రనామ పారాయణము , 'దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. "ఈ దుర్గాష్టమి మంగళవారంతో కలిసిన మరింత శ్రేష్టము", అని అంటారు.

మహర్నవమి

మానవకోటిని పునీతులను చేయుటకు భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది ఈనాడే. ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిధిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును. కావున 'సిద్ధదా' అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలుచేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగును. ఇక క్షత్రియులు , కార్మికులు , వాహన యజమానులు , ఇతర కులవృత్తులవారు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు.


విజయదశమి

దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది.  'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి , వారము , తారాబలము , గ్రహబలము , ముహూర్తము మున్నగునవి విచారించకుండా , విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము. 

'శమీపూజ' చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది , శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది , కౌరవులపై విజయము సాధించినారు. 

శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి , రావణుని సహరించి , విజయము పొందినాడు. 

తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట' ను చూచే ఆచారం కూడా ఉన్నది. 

ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని , విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి , ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |

అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

Post a Comment

0 Comments