GET MORE DETAILS

Aadhaar: ఇకపై ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు.. నవంబర్ 1 నుంచి ఇంట్లోనే అన్నీ...

Aadhaar: ఇకపై ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు.. నవంబర్ 1 నుంచి ఇంట్లోనే అన్నీ...



ఇకెంతో కాలం ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దేశంలో కోట్లాది మంది ఆధార్ కార్డుదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ గుడ్ న్యూస్ అందించింది.

నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డు వివరాల అప్‌డేట్‌లో అతిపెద్ద మార్పు తీసుకరానుంది. ఇకపై పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్ వంటి ముఖ్యమైన వివరాలను ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లకుండానే పూర్తిగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను మరింత వేగంగా, సురక్షితంగా మార్చడమే ఈ కొత్త ఆన్‌లైన్ విధానం లక్ష్యం.

పెరిగిన అప్‌డేట్ ఫీజులు...

2025 సంవత్సరం ఆధార్ చరిత్రలో ఒక ముఖ్య మలుపుగా మారింది. ఈ సంవత్సరం UIDAI కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఫీజు పెరిగింది: అక్టోబర్ 1 నుంచే అప్‌డేట్ ఫీజు కొద్దిగా పెరిగింది. చిన్న మార్పుకైనా (పేరు, అడ్రస్) ఇప్పుడు రూ. 75, బయోమెట్రిక్ మార్పులకు రూ. 125 చెల్లించాలి.

పిల్లలకు ఫ్రీ: 7 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల ఫింగర్ ప్రింట్స్, బయోమెట్రిక్ మార్చడానికి అయ్యే ఖర్చును UIDAI ఉచితం చేసింది.

ఒక ఆధార్-ఒక వ్యక్తి: నకిలీ ఆధార్ కార్డులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని UIDAI హెచ్చరించింది.

ఫ్రీ గడువు ముగిసింది: జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లు ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం ముగిసింది. ఇప్పుడు అన్ని అప్‌డేట్‌లకు ఫీజు వర్తిస్తుంది.

నవంబర్ 1 నుంచి డిజిటల్ అప్‌డేట్

నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న అతిపెద్ద మార్పు ఏమిటంటే.. జనాభా వివరాల అప్‌డేట్ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరగనుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి, చిన్న పట్టణాల వారికి ప్రతి చిన్న మార్పు కోసం కిలోమీటర్లు ప్రయాణించి ఆధార్ కేంద్రాల ముందు క్యూలో నిలబడాల్సిన అవసరం తప్పనుంది. పేరు, అడ్రస్ వంటి జనాభా వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. కానీ ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ అప్‌డేట్స్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.

Post a Comment

0 Comments