హాస్యనటచక్రవర్తి - రాజబాబు
1960 నుండి 1983 వరకూ తెలుగు సినీ వినీలాకాశంలో తనదైన హాస్యనటనతో అలరించి విభిన్నమైన శైలిలో ఓ ప్రత్యేక ముద్రను వేసి అప్పటి వారందరి మదిలో చిరకాలం గుర్తుండిపోయే హాస్యనటచక్రవర్తి రాజబాబు గారు. తన నటనా వైదుష్యంతో, సమాజంలో తోటి మనుషులకు సాయపడే ధర్మగుణంతో తన జీవితాన్ని సార్ధకం చేసుకున్న ఈ నవ్వులరేడు వరుసగా ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డులు తీసుకున్న మొదటి కమెడియన్. ఈయనకు సినిమాల్లో జోడీగా లీలారాణి, మీనా కుమారి, ప్రసన్నరాణి, గీతాంజలి, రమాప్రభ వంటి వారు నటించినా రాజబాబు - రమాప్రభల జంట హిట్ ఫెయిర్ గా ఎన్నో చిత్రాల విజయంలో తమ వంతు పాత్రను పోషించింది. ఆ కాలంలో హీరో కంటే ముందుగా రాజబాబు గారినే నిర్మాతలు బుక్ చేసుకునేవారు అనడంలో అతిశయోక్తి లేదు. హాస్యాన్నే కాదు, బాధను సైతం తన నటనలో పలికించిన రాజబాబు గారు అనుకరణకు అందని నటుడు. వాచకంలో కాని, అభినయంలో కాని ఆయన శైలి ఎవరికీ రాదు .. అక్టోబర్ 20 వ తేది శ్రీ (పుణ్యమూర్తుల అప్పలరాజు) "రాజబాబు" గారి జయంతి సందర్భంగా నివాళులతో...
0 Comments