కార్తీక మాసములో ఏంచేయాలి? ఏమి చేయకూడదు?
కార్తీక మాసం అక్టోబర్ 22 బుధవారము నుండి నవంబర్ 20 తేదీ గురువారం వరకు ఉండును.
• ఈమాసంలో శివదీక్ష తీసుకొనిన విశేష పాపాలు తొలుగును. ముఖ్యంగా సంతానం లేనివారు శివమాలవేస్తే సర్ప దోషం తొలుగును.
• ప్రతి నిత్యం శివాలయంలో ప్రదోషకాలంలో దీపారాధన చేయండి.
• గృహంలో తులసికోట వద్ద దీపారాధన చేయండి
• దేవాలయంలో నంది వెనుక మరియు నందికి,శివలింగానికి మధ్య ఎప్పుడు దీపారాధన చేయరాదు.
• వెయ్యివత్తులు,లక్షవత్తులు,కోటివత్తులు అనేవి లేవు.
ఉదాహరణకు వెయ్యివత్తులు కలిపి వెలిగిస్తే వచ్చేది ఒక్క జ్యోతి మాత్రమే ఇక్కడ జ్యోతులు లెక్కకు వస్తాయి కానీ వత్తులు కాదు. వెయ్యివత్తులు కలిపి ఒకేసారి దీపారాధన చేయకూడదు అనే నియమము లేదు చేయవచ్చు.
• కార్తీకమాసంలో కేవలం నువ్వులనూనె,ఆవునెయ్యి మాత్రమే వాడాలి మిగిలినవి వాడరాదు ఈవిషయం కార్తీక పురాణం లో వుంది.
• శివాలయాల్లో ఎక్కడపడితే అక్కడ దీపరాధనలు చేసి నూనెలు క్రింద పోసి ఆలయం పరిశుభ్రంగా ఉంచక పోయినా మనము చేసిన పూజ సిద్దించదు.
అందుకే ఈమాసంలో దేవాలయాల్లో ప్రతిరోజూ దీపారాధన చేసే వారు ఒక స్టీల్ ప్లేటు భూమిపైఉంచి అందులో మట్టిప్రమిద ఉంచి దీపారాధన చేయండి.
• ప్రతిరోజు దీపారాధన చేసిన తరువాత ఆ దీపరాధనకు లక్ష్మీ స్తోత్రం, లేదా దీపదుర్గా స్తోత్రం చదవండి.
• ఈమాసంలో కార్తీక పురాణం పుస్తకాలు కనీసం 5 ఐనా పంచండి.
• ఈమాసంలో సోమవారం శివపూజ,శనివారం విష్ణుపూజ విశేషఫలము
• సత్యనారాయణ వ్రతంచేసుకోవడానికి విశేషమాసము ఇది.
• కుదిరితే శివాలయంలో మారేడుదళాల మాల,విష్ణా లయంలో తులసిమాల ఇవ్వడం మంచిది.
• వివాహము కానివారు ఈమాసంలో కన్యాపాశుపత అభిషేకము,విద్యకోసం విద్యాపాశుపత అభిషే కము,నరదిష్టి,మృత్యుగండాలు ఉంటే మృత్యుపాశుపత అభిషేకం చేయించిన మంచిది. ఇలాటి ఎన్నో పాశుపతాలు ఉన్నాయి.
• ఈమాసంలో ఇంగువ, ఉల్లి, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ, వంకాయ, గుమ్మడి కాయ, చిక్కుడు, వెలగపండ్లను వాడరాదు. అదే విధంగా మిగిలిన అన్నం, మాడన్నం, మినుములు, పెసలు, శెనగలు, ఉలవలను కూడా వాడకూడదు.
• కార్తీకమాసమంతా కార్తీక పురాణం 30 అధ్యాయాల్లో రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం.
కార్తీక పురాణము పుస్తకము నేలపై పెట్టారాదు .ముందు పుస్తకానికి పశువు ,కుంకుమతో బొట్టుపెట్టి పారాయణ చేయాలి
• పారాయణ మధ్యలో మైల వస్తే 5 రోజులు పనికి రాదు అప్పుడు చదవ వలసిన మిగిలిన అధ్యాయాలు మిగిలిన రోజులలో పూర్తి చేయండి.

0 Comments