GET MORE DETAILS

అనుకున్న పనుల్లో అవరోధాలా...?

 అనుకున్న పనుల్లో అవరోధాలా...?



◾ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం, సంకల్ప సిద్ధి కోసం ఆచరించాల్సిన పరిహారాలు ఉన్నాయి. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్న వారైనా ఈ పరిహారాలను ఆచరించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

◾వ్యాపారాలు అనుకున్న రీతిలో సాగకపోతుంటే, వ్యాపార పురోభివృద్ధి కోసం ఒక చిన్న పరిహారం ఉంది. దీపావళి రోజున నిత్యపు నిత్యపూజలు ముగించుకున్న తర్వాత ఒక కొబ్బరికాయను, పదకొండు గురివింద గింజలను ఎర్రని వస్త్రంలో మూటకట్టి, నగదు నిల్వ చేసే పెట్టెలో లేదా బీరువాలో భద్రపరచి, ప్రతిరోజూ దానికి ధూపం సమర్పించండి.

◾సంసార జీవితంలో ఈతిబాధలు ఎదురవుతున్నా, దంపతుల మధ్య మనస్పర్థలు వస్తున్నా ద్విముఖ రుద్రాక్షను ఏదైనా ఒక సోమవారం ఉదయాన్నే పూజించి, ఎర్రని తాడుతో మెడలో ధరించండి.

◾జీవితంలో తరచుగా ఎదురయ్యే ఇక్కట్లు తొలగిపోయి, ప్రశాంతత చేకూరాలంటే దీపావళి రోజున ఇంటి ముంగిట దీపాలు పేర్చడానికి ముందు రావిచెట్టు వద్ద ఆవనూనెతో దీపం వెలిగించి, వెనుదిరిగి చూడకుండా ఇంటికి చేరుకోవాలి. ఆ తర్వాత కాళ్లు కడుక్కొని యథావిధిగా దీపావళి వేడుకలు జరుపుకోవాలి.

◾తలపెట్టిన పనుల్లో తరచు అనుకోని అవరోధాలు ఎదురవుతున్నట్లయితే ప్రతిరోజూ గణపతిని ఆరాధించాలి. ఉదయం పూజలో గణపతికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి, గణపతి గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.


గురుభ్యోనమః

Post a Comment

0 Comments