మేషం
సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.
వృషభం
కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది.
మిధునం
నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. పాత బుణాలు తీరి ఊరట పొందుతారు. కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి.
కర్కాటకం
దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా ఉండదు. ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.
సింహం
ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
కన్య
ధన వ్యవహారాలలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కలవారితో విభేదాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
తుల
కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
వృశ్చికం
చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి సమాచారం అందుతుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.
ధనస్సు
వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ అనుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.
మకరం
ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం. కుటుంబంలో వివాదాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధిక ఇబ్బందులు ఒత్తిడిని పెంచుతాయి. నూతన ఋణ యత్నాలు అనుకూలంగా ఉండవు.
కుంభం
ఉద్యోగమున ఉపశమనం లభిస్తుంది. పాత ఋణాలు తీరుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపార లాభాలు పొందుతారు.
మీనం
శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతమవుతాయి. సోదరుల సహకారంతో కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి.
