Ads Area

మన ఇతిహాసాలు: ధర్మానికి నిలువెత్తు ఉదాహరణ - వికర్ణుడు

0

📖 మన ఇతిహాసాలు : ధర్మానికి నిలువెత్తు ఉదాహరణ - వికర్ణుడు

హిందూ ఇతిహాసం మహాభారతంలో, వికర్ణుడు కౌరవులలో మూడవవాడు. అతను ధృతరాష్ట్రుడు, గాంధారి ల కుమారుడు. అతను దుర్యోధనుడికి సోదరుడు. కొన్ని గ్రంథాలలో అతను కౌరవులలో మూడవ వానిగానూ, మరికొన్నింటిలో "మూడవ-బలమైన" వ్యక్తిగానూ చెప్పబడింది. అతను గాంధారి 99 మంది పిల్లలలో దుర్యోధనుడు, దుశ్శాసనుడి తరువాతవాడు.

పాచికలాటలో దుర్యోధనుడు ద్రౌపదిని కూడా ఓడిపోయినపుడు ఆమెకు జరిగిన అవమానాన్ని ప్రశ్నించిన ఏకైక కౌరవ వీరునిగా చరిత్రలో నిలిచాడు.

🟢 జీవిత విశేషాలు

ద్రోణాచార్యుని వద్ద విద్యనభ్యసించాడు. కౌరవుల విద్యాభ్యాసం అయిన తరువాత వారిని గురుదక్షిణగా ద్రుపదుని తనవద్దకు తీసుకొని రమ్మని ద్రోణాచార్యుడు అడిగాడు.

దుర్యోధనుడు, దుశ్శాసనుడు, యుయుత్సుడు, మిగిలిన కౌరవ వీరులతో కలసి వికర్ణుడు కూడా పాంచాల దేశంపై యుద్ధానికి వెళ్తాడు. వారి దాడిని ద్రుపదుడు తిపికొదతాడు. వికర్ణుడు మరియు అతని సోదరులు యుద్ధ క్షేత్రాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది.

🔴 పాచికలాట

మహాభారతంలో పాచికల ఆట సందర్భంగా, ద్రౌపదిని కురుసభకు తీసుకొని రమ్మని దుర్యోధనుడు ప్రాతికామిని పంపాడు. ఆమె ‘నేను ధర్మ విదితయా, అధర్మ విదితయా’ అని ప్రశ్నించింది.

సభలో ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. దుశ్శాసనుడు ఆమెను సభలోనికి జుట్టు పట్టుకొని లాగాడు. ఈ దురంతాన్ని ఎదిరించిన ఏకైక కౌరవుడు వికర్ణుడు. కానీ అతని మాటలను ఎవరు వినలేదు.

🔵 మరణం

వికర్ణుడు తన అనుమానాలు ఉన్నప్పటికీ కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి కోసం పోరాడాడు.

  • 4వ రోజు – అభిమన్యుని ఆపడానికి ప్రయత్నం, కానీ విఫలం
  • 5వ రోజు – పాండవ సేనను ఎదుర్కొన్నాడు
  • 7వ రోజు – తన సోదరులను భీముడి నుండి రక్షించాడు
  • 10వ రోజు – భీష్ముడిని రక్షించడానికి ప్రయత్నించాడు
  • 13వ రోజు – అభిమన్యుని మరణంలో పాత్ర ఉన్నట్లు కథలు చెబుతాయి

14వ రోజు, భీముడు వికర్ణుడిని ధర్మపరుడిగా భావించి యుద్ధం విడిచిపెట్టమని చెప్పాడు. కానీ వికర్ణుడు తన సోదరుడిని విడిచిపెట్టలేడని చెప్పి యుద్ధంలో పాల్గొన్నాడు.

చివరకు భీముడి చేత వికర్ణుడు మరణించాడు.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area