Ads Area

వైశాఖ మాసం ప్రారంభం : వైశాఖ మాసం విశిష్టత

0

వైశాఖ మాసం ప్రారంభం : వైశాఖ మాసం విశిష్టత



వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేష దానాలకు ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాలలో పేర్కొనబడింది.

శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో తులసీ దళాలతో లక్ష్మీదేవితో కలిసి పూజించిన వారికి ముక్తి లభిస్తుంది. ఈ మాసంలో ఏకభుక్తం, నక్తం వంటి నియమాలు పాటించడం ఉత్తమం.

యజ్ఞాలు, తపస్సులు, పూజలు, దాన ధర్మాలు ఈ మాసంలో అత్యధిక ఫలితాన్ని ఇస్తాయి. సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం ఎంతో శ్రేయస్కరం.

ఉదయం స్నానం చేసి రావి చెట్టు (అశ్వత్థ) మూలాన్ని నీటితో తడిపి ప్రదక్షిణలు చేస్తే పూర్వీకులకు శాంతి లభిస్తుంది.

శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం చేయించడం కూడా శుభఫలితాలను ఇస్తుంది. మన సంస్కృతి ప్రకృతి మరియు చరాచరాలన్నింటినీ పూజనీయంగా భావిస్తుంది.

చాంద్రమానంలో చైత్రం నుండి ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు ఉంటాయి. అందులో వైశాఖమాసం ప్రత్యేక స్థానం పొందింది.

పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖమాసం అనే పేరు వచ్చింది. ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం.

ఈ మాసంలో ప్రతి రోజు పుణ్యదినమే. స్నానం, పూజ, దానం వంటి క్రియలు మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం ప్రసాదిస్తాయి.

స్నానం ప్రాముఖ్యత

వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనది. అది సాధ్యం కానప్పుడు గంగా, గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ ఇంట్లోనే స్నానం చేయాలి.

దాన ధర్మాలు

ఈ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తాడు. కనుక వేడి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నీరు, గొడుగు, పాదరక్షలు, విసనకర్రలు దానం చేయడం శ్రేష్టం.

దాహంతో ఉన్నవారికి మంచినీరు అందించడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా దేవతానుగ్రహం లభిస్తుంది.

విష్ణు ఆరాధన

ఈ మాసంలో తులసీదళాలతో శ్రీ మహావిష్ణువును పూజించాలి. మూడు నెలలపాటు విష్ణువు భూమిపై విహరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

’వైశాఖే మాధవో రాధో’

ప్రాతః స్నాన్యే ప్రీయతాం మధుసూదనః!

శ్లోకాలు

మాధవే మేషగే భానౌ మురారే మధుసూదన
ప్రాతః స్నానేన మే నాథ ఫలదోభవ పాపహన్!!

తులసీ కృష్ణ గౌరాభ్యాం తయాభ్యర్చ్య మధుద్విషమ్
విశేషేణ తు వైశాఖే నరో నారాయణో భవేత్!!

మాధవం సకలం మాసం తులస్యాయోర్చయే న్నరః
త్రిసంధ్యం మధుహంతారం తస్యనాస్తి పునర్భవః!!

ఆచరణలు

  • ప్రాతఃకాలంలో లేచి స్నానం చేయాలి
  • రావి చెట్టు ప్రదక్షిణ చేయాలి
  • ఒంటిపూట భోజనం లేదా నక్తం పాటించాలి
  • తులసీదళాలతో విష్ణు పూజ చేయాలి
  • చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి
  • పానీయాలు, పాదరక్షలు దానం చేయాలి
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area