Ads Area

పచ్చ కర్పూరం - వివరాలు - ఉపయోగాలు

0

 పచ్చ కర్పూరం - వివరాలు - ఉపయోగాలు 


మన పూర్వికులు ఇచ్చినటువంటి సాంప్రదాయాలను మనం మర్చిపోతూనే ఉన్నాము అందులో ప్రధానంగా పచ్చ కర్పూరం.

మనం ఎనకట పచ్చ కర్పూరం లడ్డూలలో, తిండి పదార్థాలలో ముఖ్యంగా పండుగ సందర్భాలలో ప్రసాదాలలో ఉపయోగించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎంత మంది దీనిని ఆచరణలో పెడుతున్నారు?

మన పూర్వీకులు మరియు ప్రకృతి ఇచ్చిన ప్రతి చిన్న మూలికలో ఒక గొప్ప శక్తి దాగి ఉంటుంది. అది అర్థమైతే అది అమూల్యమైన ఔషధం అవుతుంది.

అదే కోవకు చెందినది పచ్చ కర్పూరం. ఇది కేవలం పూజలో మాత్రమే కాదు — శరీరాన్ని శుభ్రపరచడం, గాలిని పవిత్రం చేయడం, నరాలకు ఉత్తేజం ఇవ్వడం వంటి అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది.

👉 పచ్చ కర్పూరం ఉపయోగాలు

  • నోటి దుర్వాసనను వెంటనే తగ్గిస్తుంది
  • జ్వరం, అలసట తగ్గించడంలో సహాయపడుతుంది
  • శ్వాసకోశాన్ని శుభ్రపరుస్తుంది
  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది
  • కండరాలు, నరాలకు ఉత్తేజం ఇస్తుంది
  • ఫంగల్ ఇన్ఫెక్షన్ మరియు చర్మ సమస్యలను తగ్గిస్తుంది

✔️ వాడే విధానం

  • లవంగం పరిమాణంలో నోట్లో వేసుకొని చప్పరించాలి
  • స్వీట్స్ / లడ్డూలలో (1kgకి 2–3g) కలపాలి
  • నువ్వుల నూనెలో కలిపి నొప్పులపై రాయాలి
  • పసుపుతో కలిపి చర్మంపై రాయాలి
  • పూజ గదిలో ఉంచితే గాలి శుభ్రం అవుతుంది

🔍 స్వచ్ఛమైన పచ్చ కర్పూరం గుర్తించే విధానం

  • కాల్చితే పూర్తిగా ఆవిరైపోతుంది – ఎలాంటి మిగులు ఉండదు
  • తెల్లగా చిన్న బిళ్లల రూపంలో ఉంటుంది
  • సహజమైన గట్టి వాసన ఉంటుంది
  • చేతిలో పట్టుకుంటే త్వరగా ఆవిరైపోతుంది
  • నీటిలో వేసితే మెల్లగా ఆవిరవుతుంది

❌ నకిలీ (కెమికల్) కర్పూరం గుర్తులు

  • కాల్చినప్పుడు బూడిద లేదా పొడి మిగులుతుంది
  • వాసన చాలా కఠినంగా, అసహజంగా ఉంటుంది
  • చాలా చవకగా లభిస్తుంది

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area