Ads Area

ఏలినాటి శని నుండి ఎవరు తప్పించుకుంటారు?

0

ఏలినాటి శని నుండి ఎవరు తప్పించుకుంటారు?



శని భగవానుడు అంటేనే కర్మ కారకుడు. ఎవరైతే కర్మ అనుభవించాలో వారికి కచ్చితంగా శని భగవానుడు కర్మ ఫలితాలను ఇస్తారు. ఒక జాతకుడికి ఏలినాటి శని, జన్మశని, అష్టమ శని వంటివి జరుగుతూ ఉన్నప్పుడు వారి కష్టాలు తారాస్థాయిలో ఉంటాయి. ఏలినాటి శని అంటేనే అందరూ భయపడుతూ ఉంటారు. కానీ ఏలినాటి శని వచ్చినప్పటికీ కొందరు జాతకులకు ఎటువంటి సమస్యలు రావు. కొందరికి అయితే ఏలినాటి శని వచ్చి వెళ్లినట్టు కూడా తెలియదు, అంత సంతోషకరంగా వారి జీవితం కొనసాగుతుంది.
ఎటువంటి జాతకులు ఏలినాటి శని, అష్టమ శని, జన్మ శని నుండి తప్పించుకుంటారు? జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత సూక్ష్మ విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
శని ప్రభావం లేని జాతక పరిస్థితులు:
ఏలినాటి శని గోచార రీత్యా పరిశీలన చేస్తుంటారు. లగ్నంలో చంద్రుడు, శని భగవానుడు అత్యంత బలంగా ఉన్నప్పుడు వీరిపై ఏలినాటి శని ప్రభావం ఉండదు.
ఉదాహరణకు చంద్రుడు శుక్లపక్ష చంద్రుడు, స్వక్షేత్రం, శుభగ్రహ దృష్టి, ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఈ జాతకులపై ఏలినాటి శని, అష్టమ శని, జన్మశని సమస్యలు ఉండవు.
శని భగవానుడు లగ్న శుభ గ్రహం అయినప్పుడు ఏలినాటి శని, జన్మశని, అష్టమశని సమయంలో ఇటువంటి సమస్యలు వీరికి రావు.
లగ్న శుభులు: వృషభ లగ్నం, మిధున లగ్నం, తులా, మకర, కుంభ లగ్నాలకు శని భగవానుడు లగ్న శుభుడు. ఈ జాతకులపై శని భగవానుడు ఎటువంటి సమస్యలను ఇవ్వరు.
గురు దృష్టి: ఏలినాటి శని, అష్టమ శని, జన్మ శని జరిగే సమయంలో గురువు యొక్క దృష్టి శని భగవానుడిపై ఉన్నప్పుడు వ్యాపారము, ఉద్యోగము వంటి అవకాశాలు కూడా ఇస్తుంటారు. జాతకుడు వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడు జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటుంది.
శని భగవానుడు శుభగ్రహ స్థానంలో ఉన్నప్పుడు, గురు భగవాన్ యొక్క దృష్టి ఉన్నప్పుడు ఏలినాటి శని సమయంలో శని భగవానుడు ఎక్కువగా ఇబ్బందులకు గురి చేయరు.
రెండవసారి ఏలినాటి శని వస్తే దానిని "పొంగు శని" అంటారు. ఈ సమయంలో శని భగవానుడు మీ సామర్థ్యానికి సరైన గుర్తింపును ఇస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరపడే అవకాశాన్ని ఇస్తారు.
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area