GET MORE DETAILS

మున్సిపల్‌ స్కూళ్లలో కొలువుల కోత

 మున్సిపల్‌  స్కూళ్లలో కొలువుల కోత 

‘డైరెక్ట్‌’ ఖాళీల్లోకి ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

‘ఎయిడెడ్‌’ విలీనంతో ఖాళీల భర్తీకి చెల్లు




 రాష్ట్రంలో మున్సిపల్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1167 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సర్కారు చరమగీతం పాడింది. డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, ఆ అవసరం లేదని పరోక్షంగా చెప్పేసింది. మున్సిపల్‌ పాఠశాలల్లో ఉన్న ఈ డైరెక్‌ ్ట ఖాళీల్లో ఎయిడెడ్‌ పాఠశాలల విలీనం ద్వారా వచ్చిన ఉపాధ్యాయులను నియమించాలని నిర్ణయించింది. మున్సిపల్‌ పాఠశాలల్లో ఎయిడెడ్‌ ఉపాధ్యాయులను నియమించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. విలీనమైన ఎయిడెడ్‌ ఉపాఽధ్యాయుల్ని డైరెక్ట్‌ ఖాళీల్లోనే నియమించాలనే నిబంధనను ఇందులో స్పష్టంగా పెట్టింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్న వారికి ఇది తీవ్ర మనోవేదన కలిగించే విషయమే. ప్రస్తుతం 231 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 885 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, 30 తెలుగు పండిట్‌, 17 హిందీ పండిట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మామూలుగా అయితే డైరెక్ట్‌ ఖాళీలను నేరుగా భర్తీ చేయాలి. ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల విలీనం వల్ల ఇప్పుడు ఈ పోస్టుల భర్తీ లేనట్లే. ఎయిడెడ్‌ ఉపాఽధ్యాయుల నియామకాలకు సంబంధించి కొన్ని నిబంధనలు పెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిడెడ్‌లో ఇప్పటివరకు వారు చేసిన పాత సర్వీ్‌సకు ఎలాంటి వెయిటేజి ఉండదని స్పష్టం చేసింది.  

ఒకే దెబ్బకు రెండు పిట్టలు :

మొత్తం నిర్వహణ ఖర్చును ప్రభుత్వం భరించలేని కాలంలో దాతలు, ప్రముఖ వ్యక్తులు విరాళాలు, స్థలాలు ఇచ్చి.. ట్రస్టులు ఏర్పాటు చేసి..  భవనాలు కట్టించి పాఠశాలలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తనవంతు సాయంగా ఉపాఽఽధ్యాయులకు జీతాలు మాత్రం ఇచ్చింది. ఇలా ఏర్పడినవే ఎయిడెడ్‌ పాఠశాలలు. ఆ ఎయిడెడ్‌ పాఠశాలలకు ఇస్తున్న సాయాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఆపేసింది. ఆ ఉపాధ్యాయుల్ని ప్రభుత్వ పాఠశాలల్లోకి విలీనం చేసేసుకుంది. ఎయిడెడ్‌లోనే ఆ టీచర్లు కొనసాగి ఉంటే.. మున్సిపల్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సి వచ్చేది. కానీ ఆ పనిచేయలేదు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న విధానాన్ని సర్కారు ఎంచుకుంది. ఎయిడెడ్‌లో పనిచేసేవారికి జీతాలివ్వాల్సిన పనిలేదు. ఇక్కడ మున్సిపల్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులను కొత్తగా భర్తీ చేయాల్సిన పనిలేదు. అదే సమయంలో ఎయిడెడ్‌ టీచర్లను ప్రభుత్వంలోకి తీసేసుకోవడంతో ఇక ఎయిడెడ్‌ పాఠశాలలు అనేవి లేకుండా పోయాయి. వాటిని ప్రైవేటు పాఠశాలలుగా మారిపోవచ్చంటూ ప్రభుత్వమే ఉత్తర్వులిచ్చింది. అంటే ఇప్పటివరకు తక్కువ ఫీజులు, లేకుంటే ఉచితంగా చదువు చెబుతున్న ఎయిడెడ్‌ పాఠశాలలు ఇప్పుడిక ప్రైవేటు పాఠశాలలుగా మారిపోవడంతో ఫీజులు వసూలు చేసే పరిస్థితి తలెత్తింది. ఇది విద్యార్థులకు భారంగా మారుతుందని అంటున్నారు. ప్రభుత్వం అమ్మ ఒడి ఇస్తున్నా... ప్రైవేటు స్కూళ్లలో దానికి మించి ఫీజులు ఉంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఇస్తున్నంత జీతాలు ఇచ్చి మళ్లీ అక్కడ ఉపాధ్యాయుల్ని ఎయిడెడ్‌ యాజమాన్యాలు నియమించవు. మరోవైపు విద్యార్థులపై కొంతమేరకు ఫీజు భారం కూడా పడుతుంది.

Post a Comment

0 Comments