ఈ విషయాలు మీకు తెలుసా...!
(1) మోనాకో, సాన్ మారినో,అండోరా, లిచ్టెన్ స్టీన్, వాటికన్ సిటి దేశాలలో విమానాశ్రయాలు లేవు. పొరుగుదేశాలతో ఒప్పందం కుదుర్చుకొని విమాన ప్రయాణం సాగిస్తుంటాయి.
(2) సైప్రస్, తూర్పు తైమూరు, గినియా-బిసావ్, ఐస్ లాండ్, కువైట్, భూటాన్ దేశాలలో రైల్వే వ్యవస్థ లేదు.
(3) ప్రపంచంలో ఇప్పటికి విద్యుత్ సౌకర్యం సరిగాలేకున్న దేశాలలో మొదటిది లిబియా దేశం. అంతర్యుద్ధం ఆర్థికసంక్షోభాల వలన వున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో 90 శాతం మూతబడ్డాయి.
(4) సాన్ మారినో, ఖతర్, గ్రీన్లాండ్, ఒమన్ దేశాలలో అడవులు లేవు.
(5) కెనడా, బ్రిటన్, సౌదీఅరేబియా, న్యూజిలాండ్, ఇజ్రాయిల్ దేశాలలో వ్రాతపూర్వక రాజ్యాంగాలు లేవు.సాంప్రదాయాలు, ఆచారాలు, గతప్రభుత్వ ఉత్తర్వులు మొదలైన వాటి ఆధారంగా ప్రభుత్వపాలన సాగుతోంది. వీటన్నింటిని గ్రంథస్థం చేయడం జరిగింది.
(6) ఈ భూమండలంలో 44 దేశాలకు సముద్రతీరం లేదు.
(7) అతిదీర్ఘకాలంగా వున్న రాజరిక వ్యవస్థ జపాన్ లో వుంది. యమటో వంశస్థులే గత 661 సంవత్సరాలుగా జపాన్ రాజులుగా వుంటున్నారు.
(8) అండోరాదేశానికి స్వంతసైన్యంలేదు. స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలతో రక్షణఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.
(9) ప్రజారవాణా వ్యవస్థను పూర్తిగా ఉచితంగా అందిస్తున్న దేశం లక్జంబర్గ్.
(10) నార్వేలో 42%, డెన్మార్క్ లో 41% జపాన్ లో 30% జర్మనీ 30% మంది ప్రజలు ఏ దేవుడిని నమ్మడం లేదు.
జి.బి.విశ్వనాథ, 9441245857. అనంతపురం.
0 Comments