తెలుసుకుందాం...!
(1) దారుకావనం మహాబుుషులకు సపత్నులకు సత్ పురుషులకు ఆలవాలం. ఈ దారుకావనంలో బిక్షాటన చేసిన దెవరు ?
(అ) బిక్షాటన ప్రవృత్తిగా గల పరమశివుడు✔️
(ఆ) ఒకసంవత్సర విదేశీయానంలో నున్న అర్జునుడు
(ఇ) మాయావేషంలో రాక్షసులను మభ్యపెట్టిన ఇంద్రుడు
(ఈ) బ్రహ్మచర్యవ్రతంలోనున్న బుుష్యశృంగుడు.
(2) కిరాతార్జునీయకథను సంస్కృతంలో వ్రాసినవాడు భారవి.కిరాతార్జునీయంలో శివుడు అర్జుననకు ఇచ్చిన అస్త్రమేది ?
(అ) భైరవాస్త్రం
(ఆ) నాగాస్త్రం
(ఇ) పాశుపతాస్త్రం✔️
(ఈ) ప్రమదగణాస్త్రం
(3) ముసిడిచౌడయ్య కథగల గ్రంథమేది ?
(అ) బసవపురాణం✔️
(ఆ) పండితారాధ్యచరిత్ర
(ఇ) వృషాధిపశతకం
(ఈ) అనుభవసారం
(4) వాణి నా రాణి అని చెప్పిన కవి ఎవరు ?
(అ) మహకవి కాళిదాసు
(ఆ) వీరభద్రవిజయ గ్రంథకర్తైన పోతనామాత్యుడు
(ఇ) పిల్లలమర్రి పిన వీరభద్రుడు✔️
(ఈ) శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి బానయ.బానయ పంచతంత్రగ్రంథాన్ని వ్రాసి లక్ష్మినారాయణ పండితులకు అంకితమిచ్చాడు.ఆ బానయే వాణి నా రాణి అన్నాడు
(5) విరాటపర్వంలో ద్రౌపతిని వేధించినవాడెవరు ?
(అ) కీచకుడు✔️
(ఆ) జరాసంధుడు
(ఇ) మాలాకారుడు (దండలు కూర్చువాడు) మోదకుడు
(ఈ) గజవాహిణి అధికారైన అహోబలుడు
(6)ఉత్తరభారతంలోని మధురానగర నిర్మాత ఎవరు ?
(అ) వసుదేవుడు
(ఆ) కంసుడు
(ఇ) భరతుడు
(ఈ) శత్రుఘ్నుడు✔️
(7) మత్స్యయంత్రమును భేదించినవాడెవరు ?
(అ) శ్రీకృష్ణుడు✔️
(ఆ) భీమసేనుడు
(ఇ) ఇంద్రుడు
(ఈ) అశ్వత్థామ
(8) మత్స్యయంత్రాన్ని భేదించినవాడెవరు ?
(అ) కార్త్యవీర్యుడు
(ఆ) పాండవమధ్యముడు✔️
(ఇ) కృపి
(ఈ) కృపాచార్యుడు
(9) రెండుసార్లు తాత్కాలికంగా భారత ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు ?
(అ) రాజగోపాలాచారి
(ఆ) ఐ.కే.గుజ్రాల్
(ఇ) జవహార్ లాల్ నెహ్రు
(ఈ) గుల్జారిలాల్ నందా✔️
(10) స్వతంత్రభారతానికి చివరి గవర్నర్ జనరల్ ఎవరు ?
(అ) లార్డ్ మౌంట్ బాటెన్
(ఆ) జనరల్ కరియప్ప
(ఇ) రాజగోపాలాచారి✔️
(ఈ) సర్డార్ వల్లభాయ్ పటేల్
జి.బి.విశ్వనాథ.9441245857. గోరంట్ల, అనంతపురం జిల్లా.
0 Comments