GET MORE DETAILS

తెలుసుకుందాం...!

 తెలుసుకుందాం...!




(1) విశాఖపట్నానికి ముందున్న ఇంకోపేరేమిటి ?

(అ) విశాఖపురం

(ఆ) విశాఖగూడెం

(ఇ) కులోత్తుంగచోడపట్టణం✔️

(ఈ) విశాలపట్నం 


(2) పశ్చిమగోదావరి జిల్లాలోని కొల్లేరుకు పూర్వమున్న  పేరేమిటి ?

(అ) పద్మినిపురం✔️

(ఆ) కొర్లపాడు

(ఇ) సజలపురం

(ఈ) కొలనుచేరు


(3)  విజయవాడ/బెజవాడను పూర్వం ఈ పేరున కూడా పిలిచారు. ఆ పేరేది ?

(అ) జయపురం

(ఆ) విజయప్పర్రు

(ఇ) జయసింహావాటిక

(ఈ) విజయశ్రీవాటిక✔️


(4) నాడు కంటకసొల యని పిలువబడిన నేటి ప్రాంతమేది ?

(అ) కూరగల్లు

(ఆ) ఘంటసాల✔️

(ఇ)  కావూరు

(ఈ) ధరణికోట


(5) నాటి కణ్ణబెమ్నా అనగా ?

(అ) కృష్ణపట్నం

(ఆ) కణజెందూరు

(ఇ) కృష్ణానది✔️

(ఈ) కోనసముద్రం


(6) ఘనగిరి అనగా ?

(అ) కొండవీడు

(ఆ) పెనుకొండ✔️

(ఇ) పెనుగొండ

(ఈ) ఘానాపురం


(7) వలందలు అనగా భారతదేశానికి వర్తక వ్యాపారాలకై వచ్చిన 

(అ) ఆంగ్లేయులు

(ఆ) డచ్చివారు✔️

(ఇ) పోర్చుగీసువారు

(ఈ) ఫ్రెంచివారు


(8) భారత దేశానికి వర్తకానికై వచ్చిన యూరోపియనులలో కొందరు  ఏ భాషను జెంటూ భాష అన్నారు ?

(అ) తమిలం

(ఆ) కన్నడం

(ఇ) మళయాలం

(ఈ) తెలుగు✔️


(9) " నూరార్లు లెక్కసేయక పేర్లదిన విబుధ జనుల పిలిపించుచు వేనూర్లర్థమిచ్చు వితరణి ___________ సాహెబ్ కరుణన్" అని ఎవరిని కీర్తించారు. పై ఖాళీని పూరించాలి.

(అ) కులీకుతుబ్ షా

(అ) సర్ థామస్ మన్రో

(ఇ) చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్✔️

(ఈ)చార్లెస్ విలియం బ్రౌన్‌


(10) శ్రీకృష్ణదేవరాయలను అడవిదున్న నుండి రక్షించినవాడెవరు ?

(అ) గండికోటపాలకుడైన పెమ్మసాని రామలింగడు

(ఆ) విశ్వనాథనాయకుడు✔️

(ఇ) మహామండలేశ్వర కృష్ణమనాయుడు

(ఈ) తిమ్మరుసు తమ్ముడైన సాలువ గోవిందరాజులు.

Post a Comment

0 Comments