మొక్కలకు ప్రాణం ఉంటుందని నిరూపించిన శాస్త్రవేత్త (నేడు జగదీష్ చంద్రబోస్ వర్ధంతి)
జంతువులు,మనుషులలో మాదిరిగానే మొక్కల్లో కూడా స్పందన ఉంటుందని ప్రపంచానికి తెలియజేసిన ఘనత జగదీష్ చంద్రబోస్ కు దక్కుతుంది. ఆయన క్రేస్కోగ్రాఫ్ అనే పరికరం ద్వారా ఈ విషయాన్ని రుజువు చేశారు.
వృక్ష భౌతిక శాస్త్రంలో కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు. తాను రూపొందించిన పరికరం క్రెస్కోగ్రాఫ్ను ఉపయోగించి వివిధ రకాలైన పరిస్థితుల్లో మొక్కలు ఎలా స్పందిస్తాయో పరిశోధనాత్మకంగా నిరూపించాడు. తద్వారా జంతువుల, వృక్షాల కణజాలాలలో సమాంతర ఆవిష్కరణలు చేశాడు. అప్పట్లో తాను కనిపెట్టిన ఆవిష్కరణకు సన్నిహితుల ప్రోధ్బలంతో ఒక దానికి పేటెంట్ కోసం ఫైల్ చేసినప్పటికీ, ఆయనకు పేటెంట్లంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు.ఈ క్రమంలో ఆయన అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.
బెంగాల్ ప్రావిన్సులో 1858 నవంబర్ 30న జన్మించిన బోసు కలకత్తా లోని సెయింట్ జేవియర్ కళాశాల నుంచి డిగ్రీ పుచ్చుకున్నాడు. తరువాత ఆయన వైద్య విద్య కోసం లండన్ వెళ్ళాడు. కానీ ఆరోగ్య సమస్యల వలన చదువును కొనసాగించలేకపోయాడు. తిరిగి భారతదేశానికి వచ్చి కోల్‌కత లోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా చేరాడు. అక్కడ జాతి వివక్ష రాజ్యమేలుతున్నా, చాలినన్ని నిధులు, సరైన సౌకర్యాలు లేకపోయినా తన పరిశోధనను కొనసాగించాడు.
బోసు బహుముఖ ప్రజ్ఞాశాలి.ఆయన రేడియో సిగ్నల్స్ పై కూడా పరిశోధన చేశారు.అయితే రేడియోని కనుగొన్న శాస్త్రవేత్తగా మార్కోని పేరు పొందారు.బోసు 1937నవంబర్ 23న తుదిశ్వాస విడిచారు.బోసు
లాంటి మేధావులు దేశంలో చాలా మంది ఎటువంటి ప్రోత్సాహకాలకు నోచుకోకుండా ఉన్నారు. ఇటువంటి వారిని గుర్తించి వారికి సరైన అవకాశాలు కల్పిస్తే దేశం సైన్స్ రంగంలో మరింత పురోగతి సాధిస్తుంది.
0 Comments