GET MORE DETAILS

అందరికి ఆరోగ్యం సాధ్యమేనా...? (యం.రాం ప్రదీప్) : : డిసెంబర్ 12 యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా

 అందరికి ఆరోగ్యం సాధ్యమేనా...? (యం.రాం ప్రదీప్) : : డిసెంబర్ 12 యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా



అందరికి విద్య,అందరికి ఆరోగ్యం అనే నినాదాలు ప్రభుత్వాలు ఎప్పటినుంచో ఇస్తున్నాయి.కానీ ఇవి వాస్తవ రూపం దాల్చడం లేదు.క్యూబా వంటి కొన్ని దేశాలు మాత్రమే విద్య,వైద్యం పై భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాయి.

ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే అతని భౌతిక, మానసిక, సామాజిక, ఆర్ధిక పరిస్థితులు బావుండాలి.పేదరికం ఎదుర్కొనే వారు నిత్యం బతుకు పోరాటం చేస్తున్నారు.వారికి రెక్కాడితే గానీ, డొక్కాడదు.వారికి అనారోగ్య పరిస్థితులు ఎదురయితే తట్టుకోలేరు.

కరోనా సంక్షోభం మరోసారి పేద, ధనిక దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తేటతెల్లం చేసింది.ఒకవైపు ధనిక దేశాలు కరోనా వ్యాక్సిన్లని నిల్వ ఉంచుకోవడమో లేదా పారవేయడమే చేస్తుంటే,మరోవైపు పేద దేశాల ప్రజలకు వ్యాక్సిన్లు, చికిత్స సకాలంలో అందక తల్లడిల్లిపోతున్నారు.

మహమ్మారి కారణంగా ఆర్ధిక సంక్షోభం ఏర్పడటంతో 2020 చివరికి దాదాపు 8.6 కోట్ల మంది చిన్నారులు పేదరికంలోకి జారిపోయారని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. గతంతో పోలిస్తే ఇది ఒకేసారి 15శాతం పెరిగిందని తన  నివేదికలో పేర్కొంది. అంతేకాదు, కరోనా ప్రభావంతో కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునే చర్యలు తక్షణమే చేపట్టకపోతే.. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోని దాదాపు 70 కోట్ల మంది చిన్నారులు జాతీయ పేదరిక స్థాయికన్నా దిగువకు పడిపోతారని గత ఏడాది యునిసెఫ్‌ తెలిపింది. ఇటువంటి బాధిత చిన్నారులు మధ్య సబ్-సహారా ఆఫ్రికా, దక్షిణాసియాలోనే ఎక్కువగా జీవిస్తున్నారని వివరించింది.

అందరికి ఆరోగ్యం అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018లో ఇచ్చింది. క్యూబా,నార్వే,స్పెయిన్,డెన్మార్క్,చైనా వంటి కొన్ని దేశాలు మాత్రమే ప్రజారోగ్యం ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నాయి.

మనదేశంలో కూడా విద్య,వైద్యం పై పాలకులు తక్కువగా ఖర్చు పెడుతున్నారు.

అందరికి ఆరోగ్యం సాకారం కావడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించాలి.తగినంత వైద్య సిబ్బందిని నియమించాలి.పేదవారికి వైద్య విద్య భారంగా మారింది. వారికి వైద్య విద్యని అందుబాటులోకి తేవాలి. ఆరోగ్య బీమా సౌకర్యాన్ని పేదలకు ఉచితంగా అందించాలి. గ్రామ స్థాయిలో ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలని బలోపేతం చేయాలి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ 12 న యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే గా ప్రకటించింది. ప్రతి పౌరుడుని ఆరోగ్యంగా ఉంచే బాధ్యత ప్రభుత్వాలకి ఉంది. తాజాగా న్యూజిలాండ్ సిగరెట్ ఉత్పత్తులపై నిషేధం విధించింది. ప్రభుత్వాలు మద్య, ధూమ పానాన్ని నిషేధించాలి.వాటిని ఆదాయ వనరులుగా చూడకూడదు.

Post a Comment

0 Comments