Ads Area

25న ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు

0

25న ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు





నెల 25న ఉ.9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లను విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. నూతన సంవత్సరం నేపథ్యంలో జనవరి నెలలో కూడా దర్శన సంఖ్యను టీటీడీ పెంచలేదు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 12వేలు, సర్వదర్శనం టోకెన్లు 10 వేల చొప్పున విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. జనవరి 1, వైకుంఠ ఏకాదశి జనవరి 13 నుంచి 22 వరకు 10 రోజుల పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 20 వేల టికెట్లు విసక్రయిస్తామని తెలిపింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని పేర్కొంది.

సర్వదర్శనం టోకెన్లు ఆఫ్‌లైన్‌లో 5 వేలు, ఆన్‌లైన్‌లో మరో 5 వేల టికెట్లను టీటీడీ జారీ చేయనున్నది. ఈ నెల 25న ఉ.9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లను అందుబాటులో ఉంచనుంది. మరో 5 వేల టోకెన్లను నిత్యం ముందు రోజు తిరుపతిలో టీటీడీ జారీ చేయనున్నది. ఈ నెల 31 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తామని టీటీడీ తెలిపింది.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area