Ads Area

జనవరి 8, 9 తేదీల్లో చెకుముకి సైన్స్‌ సంబరాలు

0

 జనవరి 8, 9 తేదీల్లో చెకుముకి సైన్స్‌ సంబరాలు



జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలు జనవరి 8, 9 తేదీల్లో గుంటూరులో జరగనున్నాయని జేవీవీ జిల్లా గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. శనివారం యూటీఎఫ్‌ హాల్‌లో కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించేతత్వం పెంపొందించేందుకు, వారిలోని సృజనాత్మకతను వెలికితీయడానికి వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంబరాలలో విద్యార్థులకు ప్రయోగాలు నిర్వహించడం, క్విజ్‌, శాస్త్రవేత్తలతో ముఖాముఖి తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొనున్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మురళీధర్‌ తెలిపారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్‌ రాహుల్‌, ప్రతినిధులు త్రిమూర్తులురెడ్డి, శ్రీనివాసరావు, బి.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area