Ads Area

నెరవేర బోతున్న శ్రీవారి భక్తుల కల : : అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి టిటిడి నిర్ణయం.స్వయంగా వెల్లడించిన టిటిడి చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి.

0

నెరవేర బోతున్న శ్రీవారి భక్తుల కల : : అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి టిటిడి నిర్ణయం.స్వయంగా వెల్లడించిన టిటిడి చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి.




అన్నమయ్య కాలిబాట అభివృద్ది కోసం దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్న జెడ్పీ చైర్మెన్ అకేపాటీ


శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల కల సాకారం చేసే దిశగా టిటిడి అడుగులు వేసింది.   శ్రీవారి భక్తుల కోసం పద కవితా పితామహుడు అన్నమయ్య నడయాడిన కాలిబాటను అభివృద్ది చేసేందుకు టిటిడి నిర్ణయించినట్లు టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కొద్ది సేపటి క్రితం వెల్లడించారు. అన్నమయ్య కాలిబాట అభివృద్ది కి జెడ్పీ చైర్మన్ అకేపాటి అమర్నాథ్ రెడ్డి గత కొన్ని దశాబ్ధాలుగా కృషి చేస్తున్నారు. గతంలో అన్నమయ్య కాలిబాట అభివృద్ది విషయమై ఆకేపాటి తన వాణిని దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్ రెడ్డి వద్ద గట్టిగా వినిపించారు. అందువల్ల దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి కొంత మేర చర్యలు చేపట్టారు. అయితే ఆయన మరణానంతరం ఆ విషయం అటకెక్కింది.  ఇదిలా ఉంటే 19వ సారి అన్నమయ్య కాలి బాటన అకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఈనెల 17 వ తేదీ తిరుమల పాద యాత్ర చేపడుతున్న తరుణంలో  అన్నమయ్య కాలి బాట  అభివృద్దికి అడుగులు పడే ప్రకటన వెలువడటం భగవత్ నిర్ణయం అని భక్తులు అంటున్నారు. ఏది ఏమైనా శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల కల సాకారం కాబోతుండటం ఆనందదాయకం.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area