GET MORE DETAILS

త్వరలో మెగా డీఎస్సీ: స్పీకర్

 త్వరలో మెగా డీఎస్సీ: స్పీకర్

బూర్జ, శ్రీకాకుళం జిల్లా న్యూస్‌టుడే
త్వరలో మెగా డీఎస్సీ ద్వారా లక్ష ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. బూర్జ మండల సర్వసభ్య సమావేశానికి శనివారం ఆయన హాజరై మాట్లాడారు. నాడు-నేడు పనులు కొన్నిచోట్ల అసంపూర్తిగా ఉన్నాయని, సరిగా జరగకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు సూచించారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను భర్తీ చేసి పాఠశాలల్లో ఖాళీలు లేకుండా చేసేందుకు సిద్ధమవుతుంటే, ఇంకా పనులు పూర్తి కాకపోవడమేంటని విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు.

Post a Comment

0 Comments