GET MORE DETAILS

చెట్ల మీద ఉండే పక్షులు రాత్రిపూట కింద పడకుండా ఎలా నిద్రపోగలుగుతాయి ?

చెట్ల మీద ఉండే పక్షులు రాత్రిపూట కింద పడకుండా ఎలా నిద్రపోగలుగుతాయి ?



అన్ని ప్రాణుల్లాగే పక్షులకు నిద్ర అవసరమే. ఆహారం తీసుకున్న తర్వాత, రాత్రిపూట తమ స్థావరాల్లో పక్షులు నిద్రపోతాయి. గూళ్లు కట్టుకుని కొన్ని పక్షులు అందులో నిద్రపోతే, మరికొన్ని చెట్ల కొమ్మలమీదే నిలబడి నిద్రిస్తాయి. ఒక్కోసారి ఒంటికాలిమీద నిలబడి ఏమాత్రం కిందపడకుండా ఉంటాయి కూడా. పక్షుల కాళ్లలో ఒక ప్రత్యేకమైన నరాల నిర్మాణం ఉంటుంది. అదే వాటిని కొమ్మల మీద నిద్రపోయినా కిందపడకుండా కాపాడుతుంది. పక్షుల కాళ్లలో సులభంగా వంగే బలమైన మెత్తని నరాలుంటాయి. ఇవి పక్షుల కాళ్లలో తొడభాగంలోని కండరాలనుంచి మోకాళ్లద్వారా కాలి చివరి వరకు అక్కడి నుంచి మడమచుట్టూ వ్యాపించి కాలివేళ్ల కింద దాకా ఉంటాయి. కొమ్మలపై వాలగానే పక్షుల శరీరపు బరువు వాటిని మోకాళ్లపై వంగేట్టు చేస్తుంది. అప్పుడు కాళ్లలోని నరాలు వాటంతటవే బిగుసుకుపోతాయి. దాంతో కాలిగోళ్లు ముడుచుకొని చెట్టు కొమ్మలను గట్టిగా పట్టేసుకుంటాయి. కాళ్లని నేరుగా సాచేదాకా ఆ పట్టు జారదు. అందువల్లే పక్షులు కిందపడిపోకుండా కొమ్మలపై నిద్రపోగలుగుతాయి. పక్షుల కాలిగోళ్లు కొమ్మలను ఎంత బిగువగా పట్టుకుంటాయంటే ఒకవేళ అవి అక్కడ చనిపోయినా కిందకు వేలాడుతూనే ఉంటాయిగానీ కిందపడిపోవు.

Post a Comment

0 Comments