GET MORE DETAILS

ఇక ఎప్పటికీ ‘వర్క్ ఫ్రం హోం’... ? కేంద్రం ఈ దిశగా యోచిస్తోందా ?

 ఇక ఎప్పటికీ ‘వర్క్ ఫ్రం హోం’... ? కేంద్రం ఈ దిశగా యోచిస్తోందా ? 



ఉద్యోగులు ఇక శాశ్వతంగా ‘వర్క్ ఫ్రం హోం’ చేసే అవకాశాలు రానున్నాయా ? కేంద్రం ఈ దిశగా యోచిస్తోందా ? ఈ ప్రశ్నలకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. ఈ క్రమంలోనే... కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ‘పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్’కు సంబంధించి కొత్త నియమ నిబంధనలను తీసుకు రావచ్చని వినవస్తోంది. ఈ క్రమంలో... ఉద్యోగుల వేతనాలపై ప్రభావం పడుతుంది కూడా. కాగా... తమ ఉద్యోగులకు... శాశ్వతంగా ‘వర్క్ ఫ్రం హోం’ అవకాశాన్ని కల్పించే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు వినవస్తోంది. కేంద్ర కార్మిక శాఖ అతిత్వరలోనే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంశానికి సంబంధించిన కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురావచ్చని సమాచారం. కాగా... పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోరుకునే వారి వేతనాలు తగ్గుతాయని సమాచారం. అంతేకాదు... పన్ను భారం కూడా కొంతమేర పెరగవచ్చని తెలుస్తోంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.

పని చేస్తున్న ఉద్యోగుల్లో ఎవరైనా ‘పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్’ కోరుకున్నపక్షంలో... కంపెనీలు వారికి ఆ వెసులుబాటు కల్పించేందుకు అవకాశముంటుంది. ఇది పూర్తిగా కంపెనీ ఇష్టం. ఇలా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోరుకునే వారికి వేతనాలను సవరించేందుకు కేంద్రం అనుమతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇలా పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్ కోరుకునే ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ తగ్గవచ్చు. అదేసమయంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కింద రీయిబర్స్‌మెంట్ పెరగవచ్చు కూడా. ఇంటినుంచే పని చేస్తే... విద్యుత్తు, వైఫై, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యయాలు పెరిగే క్రమంలో... వీటిని రీయింబర్స్‌మెంట్‌లో చేర్చే అవకాశముంటుంది. 

ఉద్యోగులు పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్ కింద మెట్రో నగరాల నుంచి టైర్ 2, టైర్ 3 పట్టణాలకు వెలితే.. అప్పుడు ఇందుకణుగుణంగా కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రభుత్వం ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, త్వరలోనే కొత్త నిబంధనలను ఖరారు చేయవచ్చని సంబంధిత వర్గాల నుంచి వినవస్తోంది. ఇదిలా ఉంటే... శాశ్వతంగా ‘వర్క్ ఫ్రం హోమ్’ కోరుకున్నపక్షంలో... ఉద్యోగుల వేతన నిర్మాణం  మారుతుందని టీమ్‌లీజ్ కాంప్లియన్స్ అండ్ పే రోల్ ఔట్‌సోర్సింగ్ బిజినెస్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ సింగ్ వెల్లడించారు. హెచ్ఆర్ఏ, ప్రొఫెషనల్ ట్యాక్స్ వంటి వాటిల్లో మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. ఉద్యోగులు...  మెట్రో నగరాల నుంచి నాన్ మెట్రో పట్టణాలకు రాకపోకలు సాగించినపక్షంలో... హెచ్ఆర్ఏ తగ్గుతుందని, ఆ క్రమంలో... టేక్‌హోం(నెట్‌ పేయబుల్) వేతనం  తగ్గుతుందని చెబుతున్నారు. హెచ్‌ఆర్ఏలో మార్పు వల్ల ఆదాయపు పన్నుపై కూడా నేరుగా ప్రభావం పడుతుందని చెబుతున్నారు. 

కాగా... హెచ్‌ఆర్ఏ తగ్గింపు వల్ల పన్ను భారం పెరుగుతుందని పేర్కొంటున్నారు. అలాగే తగ్గిన హెచ్ఆర్ఏ.. మూలవేతనాలకు  జత అయితే... అప్పుడు ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ పెరుగుతుందన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. అయితే...  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్... రీయింబర్స్‌మెంట్‌కు కలిసినపక్షంలో... పన్ను భారం కొంత మేర తగ్గే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే... ‘శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం’ విషఫయమై ఉద్యోగవర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వినవస్తున్నాయి. దాదాపు 80 శాతం మంది ఉద్యోగులు దీనికి సానుకూలంగా స్పందిస్తుండగా, 20 శాతం మంది మాత్రం పెదవి విరుస్తున్నారు. అయితే... వర్క్ ఫ్రం హోం తో ఉద్యోగుల సమర్ధతతోపాటు, అటు కంపెనీల ఉత్పాదకత కూడా అనూహ్యంగా పెరుగుతాయని చెబుతున్నారు. అయితే... కార్యాలయాలకు వెళ్ళి పనిచేస్తేనే ‘టీం వర్క్’ ప్రభావముంటుందని, ఇది ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తుందని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ... ఉద్యోగవర్గాల నుంచి కేంద్రం అభిప్రాయాలను ఇప్పటికే సేకరించిందని, ఈ క్రమంలో... త్వరలోనే ‘శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం’ విధానానికి శ్రీకారం చుట్టవచ్చని వినిపిస్తోంది. అయితే... పూర్తిగా వర్క్ ఫ్రం హోం కాకుండా... వారానికి మూడు రోజులపాటు వర్క్ ఫ్రం హోం చేసేలా ఆదేశాలు జారీ కావచ్చని కూడా వినవస్తోంది. మొత్తంమీద ఉద్యోగుల పని విధానంలో మార్పులు చోటుచేసుకుంటాయని మాత్రం ఖాయంగా వినవస్తోంది.

Post a Comment

0 Comments