GET MORE DETAILS

కొవిడ్-19 అంతం అభూత కల్పనే : ఆంథోని పౌచీ

 కొవిడ్-19 అంతం అభూత కల్పనే : ఆంథోని పౌచీ



ఒమిక్రాన్ విపరీత మైన వేగంతో వ్యాప్తి చెందుతుందని, దీన్ని అడ్డుకోవడం అసాధ్య మని అమెరికా అంటువ్యాధులు చికిత్స నిపుణుడు ఆంటోనీ ఫౌచీ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ ఈ వేరియంట్ ప్రభావా నికి లోనవుతారని చెప్పారు. కొవిడ్తో అమె రికా ప్రజలు కలిసి జీవించాల్సిందేనని అన్నారు. మంగళవారం ఆయన అమెరికా లోని ప్రఖ్యాత సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐ ఎస్)లో ప్రసంగిస్తూ. కొవిడ్ ను అంతం చేయడం అనేది అభూత కల్పనే అని అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్ కు ఉన్న వ్యాప్తి వేగం కారణంగా అది ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోందని పేర్కొన్నారు. టీకా తీసుకోని వ్యక్తుల కారణంగా.. వైరస్ సమూల నిర్మూలన అసాధ్యమని వెల్లడిం చారు. వ్యాక్సిన్ల సామర్థ్యం కూడా తగ్గుతోం దని ఫౌచీ అభిప్రాయపడ్డారు.

Post a Comment

0 Comments