GET MORE DETAILS

ప్రపంచంలోనే శక్తివంతమైన రాకెట్ : ఫిబ్రవరిలో ఆవిష్కరించనున్న నాసా

 ప్రపంచంలోనే శక్తివంతమైన రాకెట్ : ఫిబ్రవరిలో ఆవిష్కరించనున్న నాసా



 ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఫిబ్రవరిలో ఆవిష్కరించనున్నది. ఆర్టెమిస్ మిషన్లో భాగంగా ఈ రాకెట్ ద్వారా వ్యోమగాములను చంద్రు డిపైకి పంపనున్నది. ఆర్టెమిస్-1 మానవ రహిత ప్రయోగం కాగా, ఆర్టెమిస్ 2, 3, 4, 5 దశల్లో వ్యోమగా ములను జాబిల్లిపైకి పంపనున్నారు. ఈ మిషన్ ద్వారా తొలిసారి చంద్రమండలంపైకి మహిళా వ్యోమగామిని పంపేందుకు నాసా రంగం సిద్ధం చేస్తున్నది. చంద్రు డిపై సుదీర్ఘకాలం పరిశోధనలు కొనసాగించేందుకు అవసరమైన ఉపకరణాలను కూడా పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది. భవిష్యత్తులో అక్క డికి వెళ్లే వ్యోమగాములు వాటిని ఉపయోగించుకోవ టానికి వీలుంటుందని వివరించింది. అక్కడ ఆర్టెమిస్ బేస్ క్యాంపు నిర్మిస్తామని, ఒక గేట్వేను కూడా సిద్ధం చేస్తామని తెలిపింది. అత్యాధునిక మొబైల్ ఇల్లు, రోవర్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. భవిష్య త్తులో అంగారక గ్రహంపైకి వెళ్లేందుకు ఇవి దోహదం చేస్తాయని పేర్కొన్నది. కాగా, నాసా పంపే రాకెట్లో రెండు సాలిడ్ రాకెట్ బూస్టర్లు, నాలుగు ఆర్ఎస్-25 ఇంజిన్లు ఉంటాయి. భూమి ఉపరితలం నుంచి రాకెట్ 4.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రుడి పైకి చేరుకొంటుంది.

Post a Comment

0 Comments