GET MORE DETAILS

ఏకాదశులు - ఇరవైనాలుగు ఏకాదశులు

 ఏకాదశులు - ఇరవైనాలుగు ఏకాదశులు



ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు 1.శుక్ల పక్షము ,2. కృష్ణ పక్షము. పక్షానికొక ఏకాదశి చొప్పున్న ఇరవైనాలుగు ఏకాదశులుంటాయి.

ప్రతి నెలా ఆమావాస్య కి , పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి .

◾ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని "శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి)" అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి.

◾ప్రతి నేలా అమావాస్య కి ముందు వచ్చే ఏకాదశి ని " బహుళ ఏకాదశి " సంవత్సరం మొత్తం లో ఇటు వంటి బహుళ ఏకాదషులు 12 ఉంటాయి .

మాసము/పక్షము/తిథి----- పర్వదినం

చైత్ర శుద్ధ ఏకాదశి---------- కామదైకాదశి

చైత్ర బహుళ ఏకాదశి ------ వరూధిన్యైకాదశి

వైశాఖ శుద్ధ ఏకాదశి--- ---- మోహిన్యైకాదశి

వైశాఖ బహుళ ఏకాదశి ---- అపరఏకాదశి

జేష్ఠ శుద్ధ ఏకాదశి --------- నిర్జలైకాదశి

జేష్ఠ బహుళ ఏకాదశి------- యోగిన్యైకాదశి

ఆషాఢ శుద్ధ ఏకాదశి ------ తొలిఏకాదశి, శయనైకాదశి

ఆషాఢ బహుళ ఏకాదశి- -- కామ్యైకాదశి

శ్రావణ శుద్ధ ఏకాదశి---- -- పుత్రఏకాదశి

శ్రావణ బహుళ ఏకాదశి ---- అజైకాదశి

భాద్రపద శుద్ధ ఏకాదశి---- -పరివర్తన్యైకాదశి

భాద్రపద బహుళ ఏకాదశి-- ఇంద్రఏకాదశి

ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి- - మహాజ్జయేకాదశి

ఆశ్వయుజ బహుళ ఏకాదశి- రమైకాదశి

కార్తీక శుద్ధ ఏకాదశి --------- ఉత్థానైకాదశి, బోధనైకాదశి

కార్తీక బహుళ ఏకాదశి------ ఉత్పత్యైకాదశి

మార్గశిర శుద్ధ ఏకాదశి ------ ధృవైకాదశి, ఉత్తమైకాదశి

మార్గశిర బహుళ ఏకాదశి---- సఫలైకాదశి

పుష్య శుద్ధ ఏకాదశి --------- వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి

పుష్య బహుళ ఏకాదశి----- తిలైకాదశి

మాఘ శుద్ధ ఏకాదశి------- భీష్మఏకాదశి, జయైకాదశి

మాఘ బహుళ ఏకాదశి---- విజయైకాదశి

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి------ అమలవైకాదశి

ఫాల్గుణ బహుళ ఏకాదశి--- పాపవిమోచననైకాదశి

Post a Comment

0 Comments