GET MORE DETAILS

కాల సర్ప దోషములు - సర్పదోష ఫలితములు

 కాల సర్ప దోషములు - సర్పదోష ఫలితములు



కాల సర్ప దోషములు కలవారు వివాహం , సంతానం, కుటుంభం, అభివృద్ధి ,ఆరోగ్య విషయాల్లో అత్యధిక ప్రభావం చూపి భాదించును.

వివాహం ఆలస్యం , సంతానం పుట్టకపోవడం లేదా పుట్టినా సరైన వారు పుట్టకపోవడం, అంటే జ్ఞాన దృష్టి లేకపోవటము లేదా మెదడు సరిగా ఎదగక పోవడము, లేదా గర్భం నిలబడకపోవడం వంటి ఇబ్బందులు కుటుంబం లో తరచు గొడవలు . ఆరోగ్య సంబంధిత సమస్యలు ,భార్య భర్తల మధ్య సక్యత లేకపోవుట (లేదా) వైవాహిక జీవతం లో అసంతృప్తి, మానసిక శాంతి లేకపోవడము ,అవమానాలు లేక అపనిందల సమస్యలు ,అప్పులు పాలు అగుట.


కాల సర్ప దోషములు రకములు :

అనంత కాల సర్ప యోగము :

జన్మ లగ్నము నుండి సప్తమ స్థానము వరకు రాహు కేతు గ్రహముల మధ్య మిగతా గ్రహములు.

( రవి ,చంద్ర ,కుజ ,బుధ ,గురు ,శుక్ర, శని ). వుంటే దీనిని అనంత కాల సర్ప యోగము అంటారు.

ఫలితాలు: కుటుంభ సమస్యలు, దీర్గ రోగాలు, వైవాహిక జీవతం లో అసంతృప్తి, మానసిక శాంతి లేకపోవడము, రునగ్రస్థులు అగుట హామీలు ఉండుట జరుగును.

గుళిక కాల సర్ప దోషం :

మాములుగా ఇది జాతక చక్రం లో రెండోవ ఇంట ప్రారంభం అయ్యి ఎనిమిదొవ ఇంట సంమప్తం అవుతుంది.

ఫలితాలు: ఆర్ధిక మరియు కుటుంభ ఇబ్బందులు, . భార్య భర్తల మధ్య సక్యత లేకపోవుట ( లేక ) వైవాహిక జీవతం లో అసంతృప్తి, మిత్రులవలన విరోదములు కలుగును.

వాసుకి కాల సర్ప దోషం :

మూడోవ ఇంట మొదలయి తొమ్మిదొవ ఇంట సమాప్తం.

ఫలితాలు: అన్నదమ్ముల కలహాలు, సమస్యలు, బందువుల వలన సమస్యలు ఎకువగా వుంటాయి. ఉద్యోగములో బాధలు, పదోనతిలో ఆటంకాలు, ఉద్యోగము వుదిపోవటం జరుగును.

శంక పాల కాలసర్ప దోషం :

నాలుగోవ ఇంట మొదలయి పదవ ఇంట సమాప్తం.

ఫలితాలు: తల్లి వలన లేదా తల్లికి సమస్య, వాహన గన్డం, నివాస స్తల సమస్యలు, విద్య లో ఆటంకములు, ఉద్యోగ, వ్యాపారములలో లాబములు లేకపోవుట.

పద్మ కాలసర్ప దోషం :

అయిదోవ ఇంట ప్రారంభమయి పదకొండవ ఇంట సమాప్తం.

ఫలితాలు: జీవిత భాగస్వామి తో కాని పిల్లలతో కాని సమస్యలు విచిత్ర వ్యాదులు రావడము, వ్యసనముల వల్ల భారి నష్టాలు రావడం, భార్య భర్తల మధ్య అనుమానాలు తలేతడం, ధనము ఖర్చుఅగుట, శత్రువుల వలన జైలుకు వెల్లడము, కష్టాలు కలుగును, బాల్యము నుండీ బాధలు కలుగును.

మహా పద్మ కాలసర్ప దోషం :

ఆరవ ఇంట ప్రారంభం అయ్యి పన్నెండవ ఇంట సమాప్తం.

ఫలితాలు: ఆరోగ్య సమస్య, అప్పుల బాధ, శత్రు బాధ, భార్య భర్తలు అనుకూలముగా లేకపోవడము, జీవితాంతము రోగముల వలన బాధ నిరాస యకువగా ఉండును. వ్రుధాప్యము లో కష్టాలు కలగడము, శత్రువులతో పోరాడటం, గృహము నందు అసంతృప్తి కలుగుతుంది.

తక్షక కాలసర్ప దోషం :

యేడవ ఇంట ప్రారంభం లగ్నము ఇంట సమాప్తం.

ఫలితాలు: వ్యాపారము లో చిక్కులు, పిత్రార్జితం ఖర్చు చేయడము, పుత్ర సంతానము లేదని బాధ పడటము, జీవిత భాగస్వామి తో సమస్యలు, పర శ్రీ సంగమము, శత్రు పీడా, అనారోగ్యం కలుగును.

కర్కోటక కాలసర్ప దోషం :

ఎనిమిదొవ ఇంట ప్రారంభం రెండోవ ఇంట సమాప్తం.

ఫలితాలు: వైవాహిక జీవతం లో అసంతృప్తి, అకాల మరణము, మోసములకు గురికావడము, దీర్గ రోగములు, ఆపరేషన్లు, ఎంత కష్టపడిన పలితము దక్కదు. జీవితములో అన్ని ఆలస్యముగా జరుగుతాయి, మంచి ఉద్యోగము దొరుకుట చాల శ్రమ చేయవలసి వస్తుంది, విపరీత ధన నష్టము జరుగును.

శంఖచూడ కాలసర్ప దోషం :

తొమ్మిదొవ ఇంట ప్రారంభం వ మూడోవ ఇంట సమాప్తం.

ఫలితాలు: అత్యంత దురదృష్ట స్తితి, దేవుని యందు భక్తి లేకపోవడము, తండ్రి, గురువులతో విరోధము, వ్యవసాయము నందు అధికముగా శ్రమించిన నష్టములు కలుగును. అవమానములు, బాధలు, ధనము నందు అసంతృప్తి కలుగును.

ఘటక కాలసర్ప దోషం :

పదవ ఇంట ప్రారంభం నాలుగోవ ఇంట సమాప్తం.

ఫలితాలు: వ్యాపార మరియు ఉద్యోగ సమస్యలు, తల్లి తండ్రులకు దూరముగా నివసించదము, మిత్ర ద్రోహులు , వ్యాపార లావా దేవులలో నష్టము, సంతాన దోషములు కలుగును.

విషక్త, లేక విష దాన కాలసర్ప దోషం :

పదకొండవ ఇంట ప్రారంభం అయిదోవ ఇంట సమాప్తం.

ఫలితాలు: ఆర్ధిక మరియు వ్యాపార కష్టాలు, నేత్ర సంబంధ రోగములు , సోదరులు , మిత్రులతో తగాదాలు, గృహమును విడచి పరదేశములో నివసించదము, కోర్టు వ్యవహారములలో తల దుర్చడం, రహస్య విషయాలు గోప్యముగా ఉంచడము జరుగును.

శేషనాగ కాలసర్ప దోషం :

పన్నెండవ ఇంట ప్రారంభం ఆరవ ఇంట సమాప్తం.

ఫలితాలు: ఎక్కువ ఖర్చులు, శత్రు బాధలు కోర్టు వివాదాలు , అవమానాలు, ప్రాణభయము, అధిక ఖర్చులు.

Post a Comment

0 Comments