GET MORE DETAILS

మరో వీడియో విడుదల చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

 మరో వీడియో విడుదల చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు



తమ దేశ రాజధానిని కాపాడుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ముఖ్య నాయకులతో కలిసి ప్రమాణం చేశారు.

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్ స్కీ శుక్రవారం సెంట్రల్ క్లైవ్ నుంచి ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా తమ రాజధానిని రక్షించుకుంటామని ఆయన ఆ వీడియోలో తెలిపారు.

'మేమంతా ఇక్కడే ఉన్నాం. మా మిలిటరీ ఇక్కడే ఉంది. సమాజంలోని పౌరులు ఇక్కడ ఉన్నారు. మనమందరం మన స్వాతంత్ర్యం, మన దేశాన్ని కాపాడుకుందాం' అని జెలెన్ స్కీ ప్రెసిడెన్సీ భవనం ముందు నిలబడి అన్నారు.

ఆలివ్ ఆకుపచ్చ మిలిటరీ తరహా దుస్తులు ధరించిన జెలెన్ స్కీ.. తన ప్రధాన మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఇతర సీనియర్ సహాయకులతో కలిసి పుతిన్పై ఒత్తిడి పెంచెలా మాట్లాడారు.

కాగా... మాస్కోలో మీడియాతో మాట్లాడిన పుతిన్.. జెలెన్ స్కీ ప్రభుత్వాన్ని 'ఉగ్రవాదులు, మాదకద్రవ్యాల బానిసలు, నియో నాజీల ముఠా'తో పోల్చారు. పైగా.. ఉక్రేనియన్ మిలిటరీని ఆ దేశ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని కోరారు.

పుతిన్ ప్రకటించిన యుద్ధాన్ని ప్రతిఘటించాలంటూ.. జెలెన్ స్కీ అనేక దేశాల నాయకులను కోరారు. తమ దేశం ఒంటరై పోయిందని ఆయన అన్నారు.

Post a Comment

0 Comments