GET MORE DETAILS

1500 యేళ్ళ క్రితమే అంగారక గ్రహం పై నీళ్లు, ఇనుము ఉందని చెప్పిన వరాహమిహిర !

 1500 యేళ్ళ క్రితమే అంగారక గ్రహం పై నీళ్లు, ఇనుము ఉందని చెప్పిన వరాహమిహిర ! 



ప్రస్తుతం మనదేశం నుండి ఇస్రో, అమెరికా నుండి నాసా అంతరిక్ష వీక్షణం చేస్తూ మన విశ్వం గురించి ఎన్నో విషయాలను కనుగొంటున్నారు. అయితే భారతదేశానికి చెందిన ఉజ్జయిని దేశస్థుడు ఖగోళ, గణిత శాస్త్రజ్ఞుడు, మరియు జ్యోతిష్కుడు అయిన వరాహమిహిర 1500 సంవత్సరాల క్రితమే విశ్వం గురించి, మన గ్రహాల గురించి తన పుస్తకంలో అంచనా వేసి రాసుకున్నాడు. ఆయన రాసిన వాటిని గురించి తెలుసుకున్న మన శాస్త్రవేత్తలు ప్రస్తుతం షాక్ కు గురవతున్నారు. వరాహమిహిర చేసిన పరిశోధనల గురించి కాస్తంత తెలుసుకుందాం.

వరహమిహిర ఎవరు ?

499 సంవత్సరంలో కపిత అనే ప్రాంతానికి దగ్గరలో గల ఉజ్జయినిలో జన్మించాడు వరాహమిహిర. ఇతని తండ్రి ఆదిత్యదాసుడు సూర్యభగవానుడికి గొప్ప భక్తుడు. వరాహమిహిరుడు ఖగోళ మరియు గణిత శాస్త్రంలో నైపున్యుడు మరియు జ్యోతిష్కుడు. వరాహమిహిర సూర్య సిద్ధాంత’ పేరు మీదట 515 లోతన మొదటి గ్రంథాన్ని రాశాడు.

సూర్య సిద్ధాంతం :

సూర్య సిద్ధాంత గ్రంధంలో నక్షత్ర మండలాలు, ఇతర సౌర గ్రహణాలు వాటి స్థానాలను గురించి వరాహమిహిర తెలిపాడు. ఇందులో , దేవతలు మరియు రాక్షసులు, దేవుడు బ్రహ్మ సృష్టి నుండి గడచిన కాలానికి చెందిన రోజు మరియు రాత్రి, గ్రహాలు తూర్పు తరలించడానికి మరియు నక్షత్ర విప్లవం సంవత్సరం పొడవు గురించి పేర్కొన్నారు. . భూమి వ్యాసం, చుట్టుకొలత, చంద్రుడి యొక్క రంగు ,చుట్టుకొలతలను ఈ పుస్తకంలో వరాహమిహిర తెలిపాడు. ఇంకా ఈ పుస్తకంలో అంగారక గ్రహం గురించి ఎంతో వివరంగా తెలిపాడు. ఆయన ఆ పుస్తకంలో అంగారక గ్రహంపై నీరు మరియు ఇనుము ఉన్నట్లు అప్పుడే చెప్పారు. ఈ విషయాన్ని నాసా మరియు ఇస్రో బహిర్గతం చేశాయి. ఇంకా ఈ పుస్తకంలో సౌరవ్యవస్థలోని ప్రతి గ్రహం సూర్యునిచే సృష్టించబడింది అని వివరంగా చెప్పాడు.

సూర్యసిద్ధాంతం దొంగలించబడింది :

కొన్ని ఏళ్ళ క్రితం వరాహమిహిర రాసిన సూర్యసిద్ధాంత గ్రంధం ప్రస్తుతం దొంగలించబడింది. అయితే ముందుచూపుగా కొందరు మేధావులు రికార్డ్ చేసుకోవడం వలన ముందుముందు పరిశోధనలకు ఉపయోగపడింది. ఇలా రికార్డ్ చేయబడిన ఆ గ్రంధంలోని విషయాలను చాలా భాషలలోకి అనువాదం చేయడం జరిగింది. నాసా అంగారక గ్రహంపై పరిశోధన చేస్తున్నప్పుడు, రిటైర్డ్ ఐపిఎస్ అయిన అరుణ్ ఉపాధ్యాయ్ వరాహమిహిర అంగారక గ్రహం గురించి రాసిన విషయాలను అధ్యయనం చేశాడు. ఆ అధ్యయనం ఆయన అంగారక గ్రహంపై ఒక పుస్తకాన్ని రాశాడు.

జ్యోతిష్యశాస్త్రం :

వరాహమిహిర జ్యోతిష్యంలోనూ తనదైన ప్రతిభను కనబరిచారు. ఆయన మొత్తం జ్యోతిష్యంలోని మూడు ముఖ్యమైన జ్యోతిష్యాలను రాశాడు. బృహత్ జాతక, లఘు జాతక, సమస సంహిత జాతక, బృహత్ యోగయాత్ర, యోగాయాత్ర, బృహత్ వివాహ పతల్,లగ్న వారాహి, కుతూహల మంజరి, దైవాంజ వల్లభ జ్యోతిష్యగ్రంధాలను ఆయన రాశాడు.

వరాహమిహిర తనయుడు ప్రితుయాసస్ కూడా హిందూ జ్యోతిష్య గ్రంధాన్ని రాశాడు. ఈయన ‘హోరా సర’జ్యోతిష్యంలో జాతకం గురించి చాలా గొప్పగా రాశాడు. మధ్యయుగ బెంగాలీకి చెందిన ఖానా (లీలావతి) కవయిత్రి, జ్యోతిష్యురాలును వరాహమిహిర కోడలుగా చెబుతారు.

Post a Comment

0 Comments