GET MORE DETAILS

మునగ ఆకు ఉపయోగాలు - సంపూర్ణ వివరణ

 మునగ ఆకు ఉపయోగాలు - సంపూర్ణ వివరణమనలో చాలామందికి మునగ ఆకును ఆహారముగా తీసుకొవచ్చు అనే సంగతి చాలమందికి తెలియదు . మరికొంతమందికి మునగ ఆకు శరీరానికి వేడి చేస్తుందని అపొహ కూడా కలదు. ప్రకృతి ప్రసాదించిన అతి ముఖ్యమైన ఆహారపు విలువలు కలిగిన పదార్ధాలలో మునగాకును తప్పకుండా చేర్చాలి. మునగాకులో ఉన్న విటమిన్స్ గాని , ఖనిజ లవణాలు శరీరానికి అమితమైన మేలుని కలిగించును.  

ఇప్పుడు మునగాకులోని ఆహారపు విలువల గురించి సంపూర్ణముగా తెలుసుకుందాం...

మునగాకులో ఆహారపు విలువలు :

★ 16 కిలోల మాంసంలో విటమిన్ A ఎంత ఉంటుందో ఒక కప్పు మునగాకు రసంలో అంతే A విటమిన్ ఉంటుంది. అదేవిధముగా 9 గుడ్లలో గాని , 80 కప్పుల తాజా ఆవుపాలలో గానీ , అరకిలో వెన్నలో గానీ విటమిన్ A ఎంత ఉంటుందో 1 కప్పు మునగాకు రసంలో అంత ఉంటుంది. 

★ 16 అరటిపళ్ళలో గానీ , 8 ఆపిల్స్ లో గానీ , 6 కమలాలలో గానీ , రెండున్నర కిలోల ద్రాక్షలోగానీ , 6 నిమ్మకాయలలో గానీ , 20 మామిడి కాయలలో గానీ , ఏడున్నర కిలోల పుచ్చకాయలలో గానీ విటమిన్ C ఎంత ఉంటుందో అంత 1 కప్పు మునగాకు రసంలో C విటమిన్ ఉంటుంది. 

★ 900 గ్రాముల బాదంపప్పులో గానీ , 8 కమలాలలో గానీ , మూడున్నర కిలోల బొప్పాయిలోగాని , 20 కోడిగుడ్లలో గానీ , రెండున్నర కిలోల మాంసంలో గానీ ఎంత క్యాల్షియం ఉంటుందో అంత 1 గుప్పెడు మునగాకులో అంత క్యాల్షియం ఉంటుంది. 

★ అదేవిధముగా దీనిలో ఉన్న మాంసకృత్తులు కూడా మాంసం , చేపలు , గుడ్లు , పాలు మొదలగు వాటిలో ఉన్నవాటికంటే అధికంగా ఉన్నాయి. 

★ పైన మీకు మునగాకులో ఉన్న విలువైన విటమిన్ల గురించి పోషకాల గురించి వివరించాను. ఇప్పుడు మీకు మునగాకుతో ఔషధయోగాల గురించి సంపూర్ణముగా వివరిస్తాను.

మునగాకుతో ఔషధ యోగాలు : 

★ మరిగే నీటిలో గుప్పెడు మునగాకులు వేసి గట్టిగా మూతపెట్టి 5 నిమిషాలు ఉంచిన తరువాత ఆ పాత్రను చన్నీటిలో పెట్టి బాగా చల్లార్చి పాత్రలోని మునగాకు తీసివేసి మిగిలిన రసములో కొద్దిగా మిరియాలపొడి తగినంత ఉప్పు , 1 చెంచా నిమ్మరసం వేసి ప్రతిరోజూ ఉదయం సేవిస్తూ ఉంటే అజీర్తి , ఉబ్బసం , రక్తహీనత , మామూలు జలుబు , దగ్గు , నిస్సత్తువ వంటివి దరిచేరవు . 

★ ఒక స్పూన్ మునగాకు రసము , కొద్దిగా తేనె , ఒక గ్లాసు కొబ్బరినీటిలో కలిపి కలరా , విరేచనాలు , కామెర్ల వ్యాధులలో ఔషధాలు వాడుకుంటూ ఈ మిశ్రమాన్ని కూడా రోజుకి 2 నుంచి 3 సార్లు తీసుకుంటూ ఉంటే మంచిఫలితాలు వస్తాయి. 

★ ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ప్రతిరోజూ పిల్లలకు తినిపిస్తుంటే పిల్లలు మంచి ఆరోగ్యముగా ఉండి చిన్నచిన్న వ్యాధులను లెక్కచేయకుండా చక్కగా ఆడుకుంటారు. వారి ఎముకలు గట్టిపడి పెరుగుదల బాగా ఉంటుంది. 

★ ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ఆ మిశ్రమాన్ని గర్భిణీలు గర్భము ధరించిన నాటినుండి తీసుకొనుచున్న పిండము చక్కగా పెరుగుటయే కాక ప్రసవం సౌఖ్యముగా అగును. దీనిలో ఉన్న క్యాల్షియం , ఐరన్ , విటమిన్స్ బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడును. కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా అన్ని వయసులవారు స్త్రీపురుష బేధము లేకుండా టానిక్ లాగా వాడుకొనవచ్చు. ఈ మిశ్రమాన్ని బాలింతలకు ఇచ్చిన సమృద్దిగా పాలు ఉత్పత్తి అగును. ప్రసవానంతరం త్వరగా కోలుకుంటారు. 

★ బాగా మరిగించి చల్లార్చిన మునగాకు రసం ఒక చెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ నందు కలుపుకుని తాగిన మూత్రవిసర్జనలో మంట , కొన్ని మూత్రపిండాల వ్యాధులు , మలబద్దకం తగ్గును. 

★ ఒక చెంచా మునగాకు రసములో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ పడుకునే ముందు తాగుచున్న రేచీకటి తగ్గును. ఇంకా ఙ్ఞాపకశక్తి కూడా పెరుగును.

★ పైన చెప్పిన మిశ్రమము నందు కొంచం నిమ్మరసం కూడా కలిపి తీసుకుంటే తలతిరుగుడు , మొలలు , ఎక్కిళ్లు , అజీర్ణం , తీసుకున్న ఆహారం శరీరానికి ఒంటబట్టకపోవడం వంటి సమస్యలు నివారణ అగును. 

★ మునగాకు రసము నందు నువ్వులనూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంతవరకు మరగకాచి ఆ మిశ్రమాన్ని గజ్జి , దురద వంటి చర్మవ్యాధులకు పైపూత ముందుగా రాయుచున్న చర్మవ్యాధులు అంతరించును. 

★ మునగాకులను బాగా వేడిచేసి చిన్నచిన్న దెబ్బలకు , బెణుకు నొప్పుల పైన వేసి కట్టు కట్టిన నొప్పుల బాధలు తగ్గును. 

★ మునగాకు రసము లో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్న ముఖము పైన మొటిమలు నశించి ముఖచర్మం మృదువుగా అగును. 

★ ఒకస్పూను మునగాకు రసములో 3 మిరియాలు పొడి చేసి కలిపి కణతలు పైన రాసుకున్న తలనొప్పి అంతరించును. 

★ పైన చెప్పిన విధంగా ఎన్నో విలువైన యోగాలు కలవు. ఇప్పుడు మీకు మునగకాయలు మరియు మునగ పువ్వుల ఉపయోగాలు కొన్ని వివరిస్తాను . 

★ మునగ కాయలు , పచ్చిమామిడి కాయలు కలిపి వండిన కూర తినుచున్న వేసవిలో శరీరానికి చలవ చేకూరటయే గాక మన దేహము నందలి ఐరన్ , విటమిన్ C లోపించకుండా ఉంటాయి. 

★ మునగ పువ్వులను పాలలో వేసి కాగబెట్టి తాగుచున్న తాత్కాలిక నపుంసకత్వం తగ్గును. 

★ ఒక స్పూన్ మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగుచున్న ఉబ్బసానికి , అజీర్తికి మంచి ఔషధముగా పనిచేయును . 

★ మూత్రపిండాల వ్యాధిలో సంబంధిత మందులతో పాటు లేత కొబ్బరినీటిలో ఒక చెంచా మునగపువ్వుల రసము కలిపి తాగుచున్న మంచి ఫలితాలు కలుగును.

★ మరెంతో విలువైన మరియు అతి సులభ  యోగాలకు నేను రచించిన గ్రంథములు చదవగలరు.

గమనిక -

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

నా మూడవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

కాళహస్తి వేంకటేశ్వరరావు 

అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

9885030034

ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి.

Post a Comment

0 Comments