GET MORE DETAILS

ఏప్రిల్ 20న ఆకాశంలో అద్భుతం. సరళ రేఖపైకి 4 గ్రహాలు

 ఏప్రిల్ 20న ఆకాశంలో అద్భుతం. సరళ రేఖపైకి 4 గ్రహాలుఏప్రిల్ 17 నుంచి పైన పేర్కొన్న గ్రహాలు దాదాపు ఒకే రేఖపైకి వచ్చినట్టు కనిపిస్తాయి. 

అయితే ఏప్రిల్ 20న ఉదయం సూర్యోదయానికి ముందు మరింత స్పష్టంగా కనుల విందు చేస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే గ్రహాలను చూసేందుకు అనువైన పరిస్థితులు ఉండాలంటున్నారు. శని, అంగారక, శుక్ర గ్రహాలు ఒకే రేఖపైకి రావడం మార్చి చివరి నుంచే మొదలైంది. అయితే ఏప్రిల్ తర్వాత బృహస్పతి కూడా ఈ రేఖపైకి వస్తుంది. ఖగోళ అద్భుతాలు అరుదుగా సంభవిస్తుంటాయి. మరీ ముఖ్యంగా 4 గ్రహాలు ఒకే రేఖపైకి రావడం చాలా చాలా అరుదని పేర్కొంటున్నారు. మరోవైపు ఏప్రిల్ 23న ఈ నాలుగు గ్రహాల సరసన చంద్రుడు కూడా చేరబోతున్నాడు. సరళ రేఖ కుడిపక్కన చందమామ కనిపిస్తుంది. అయితే అంతరిక్షం నుంచి చూస్తే ఒక్కో గ్రహం ప్రత్యేకంగా కనిపిస్తాయి.

Post a Comment

0 Comments