GET MORE DETAILS

కష్టాల నుండి బయట పడేందుకు దారి చూపే అద్భుత మంత్రం.

 కష్టాల నుండి బయట పడేందుకు దారి చూపే అద్భుత మంత్రం.

 



ఒక నాడు హనుమంతులవారు సీత దేవి కోసం లంకకు వెళ్లారు. అక్కడ ఆ తల్లి సీత దేవి యొక్క జాడ దొరకని సమయంలో. శ్రీ రామున్ని ఉద్దేశించి హనుమంతులవారు ఒక శ్లోకంతో శ్రీ రామున్ని స్తుతిస్తారు/కొలుస్తారు/వేడుకొంటారు. వెనువెంటనే హనుమంతునికి తను వచ్చిన కార్యం సఫలం అవుతుంది. అంతటి మహిమాన్మితమైన శ్లోకం అని దీని గురించి సుందరాకాండలో ప్రస్తావించారట.

అప్పటినుండి ఎవరైతే వారి యొక్క సమస్యకు దారి (పరిష్కారం) తెలియక సతమతమవుతున్నారో వారెల్లరూ కూడా శ్రీ రామున్ని ఈ శ్లోకం తో వేడుకొంటే వెంటనే వారికి మార్గం దొరికి, వారి కష్టాలు తీరతాయని ప్రతీతి. అటువంటి అద్భుతమైన శ్లోకం ఏంటో తెలుసుకొందామా...!

" నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యైచ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః "

Post a Comment

0 Comments