GET MORE DETAILS

తిరుపతి చరిత్ర _ జిల్లాగా మారుతున్న తరుణంలో...

 తిరుపతి చరిత్ర _ జిల్లాగా మారుతున్న తరుణంలో...



రాష్ట్రంలోని మిగతా జిల్లాల పునర్వ్యవస్థీకరణ కొద్దిసేపు పక్కన పెడితే, 'తిరుపతి జిల్లా'  డిమాండ్ చాలా దశాబ్ధాలుగా ఉంది....! నిజానికి రాయలసీమ అని చెప్తారు కానీ, 'కోర్' రాయలసీమ జిల్లాలయిన, కర్నూల్, కడప, కొంత అనంతపురం లతో పోలిస్తే, తిరుపతి ప్రాంతం, ఏ విధంగానూ, రాయలసీమ పారమీటర్స్ కి సరితూగదు.

చిత్తూరు జిల్లా నే తూర్పు, పడమరలుగా విభజించవచ్చు. నెల్లూరు నుంచి నాయుడుపేట దాటి శ్రీ కాళహస్తి లో మొదలయ్యే, "తిరుపతి" ప్రాంతం, ఎనభైల ప్రాంతాల దాకా తమిళ ప్రాబల్యం నలభై శాతం పైన ఉన్న ప్రాంతం. 

అసలు తిరుపతి ప్రాంతం ఏదీ అంటే... తిరుమల, కాళహస్తి, సత్యవేడు, పిచ్చాటూరు, పుత్తూరు, నగరి, రేణిగుంట, తిరుపతి, చంద్రగిరి.

నగరి దాటితే తమిళనాడు తిరుత్తణి బార్డర్...

 పుత్తూరు, పక్కనే ప్రఖ్యాత దేవాలయం నారాయణ వనం, ఆ పక్కనే ఇంకొక పెద్ద గుడి..నాగలాపురం, ఇవి దాటగానే మళ్లీ తమిళ నాడు బార్డర్ ఊత్తుకోట, చంద్రగిరి దాటి చిత్తూరు చేరితే మళ్లీ అక్కడ తమిళనాడు బార్డర్,  ఇక తిరుపతి సంగతి తెలిసిందే. 

స్వాతంత్య్రం తర్వాత ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో, 'తిరుపతి' మాకు కావాలని తమిళనాడు వాళ్ళు, పేచీ పెట్టారు. చాలా సంఘటనలు తర్వాత, తిరుత్తణి ని వాళ్ళకిచ్చి, సత్యవేడు ను మనం తీసుకున్నాం....అలా తమిళ ప్రాబల్యం చాలా ఎక్కువ మొదటి నుంచి.

ఒక్క సారి తిరుపతి చరిత్ర లోకి వెళ్తే....

తిరుమల గుడి లో అళ్వారులు, మొదలుకొని, జియ్యంగార్ల వరకు, తమిళ వాసనే. విజయనగర కాలం అంటే, కృష్ణ దేవరాయలు, అచ్యుత దేవరాయలు కాలంలో 1509 నుండి 1542 వరకు, అటు పిమ్మట 1565 దాకా ఆళియ రామరాయలు కింద కొంత తెలుగు ప్రాబల్యం హెచ్చినా కూడా, 1565 తల్లికోట యుద్ధంలో ఓటమి తర్వాత, వెంకటపతి రాయలు, చంద్రగిరి కేంద్రంగా, ఇక్కడ నుంచి కంచి, తంజావూరు, మదురై దాకా తమిళ రాజ్యాలను గవర్నరుగా పరిపాలించారు. తమిళం మళ్లీ వచ్చేసింది చంద్రగిరికి.

1585లో, వెంకటపతి దేవ రాయలు విజయనగర చక్రవర్తి అయిన తర్వాత, మొదట పెనుగొండ లోనే రాజ్యం చేసినా, గోల్కొండ, బీజాపూర్ ముస్లిం రాజ్యాలకు తన రాజధాని చాలా దగ్గరగా ఉండడం, అప్పటికి విజయనగరం బలహీనం గా ఉండడం తదితర కారణాలతో, విజయనగర సామ్రాజ్యం, హంపీ, పెనుగొండ తర్వాత, తన మూడవ రాజధాని "చంద్రగిరి" కి 1592 వ సంవత్సరంలో మార్చాడు అరవీటి వెంకటపతి రాయలు.

చంద్రగిరి నుంచి, పైన ఉన్న, కడప, సిద్ధవటం, నంద్యాల, కందనవోలు, చిట్యాల, అనంతపురం, పెనుగొండ, మడకశిర, గుత్తి, నెల్లూరు, ఉదయగిరి, కనిగిరి, అద్దంకి, వెలుగోడు, కాళహస్తి,  తదితర సామంత రాజ్యాలను, ... చంద్రగిరి కింద బాగాన ఉన్న, కంచి, మధురాంతకం , వెల్లూరు, జింజీ, తంజావూరు, పుదుక్కోటై, మధురై, , తిరుచ్చి అటువైపు వున్న కన్నడ రాజ్యాలైన, మైసూరు, కోలార్, చిత్రదుర్గ, ఇక్కేరి, బేలూరు నుంచి శ్రీ రంగ పట్నం నుంచి మంగళూరు దాకా తన అమర నాయక సామంత రాజ్యాలుగా 1614 దాకా ఏలిన చక్రవర్తి.... వెంకటపతి రాయలు.

ఎప్పుడూ పేరు వినలేదు అనుకొంటే, మీ తప్పు కాదు...ఎందుకంటే, ఇతని సమకాళికుడు అక్బర్, రెండు సార్లు గుజరాత్ వైపు నుంచి దాడి కోసం, రెండు సార్లు, తన ప్రతినిధులను పంపాడు...అది అక్బర్ అలవాటు, లొంగిపో అని చెప్పడం. ఒక సారి 1600 లో ఇంకోక సారి 1604 లో...రెండు సార్లు కూడా ఏమీ చెప్పకుండా పంపించేశాడు...ఆ తర్వాత రెండు సంవత్సరాలకి అక్బర్ చనిపోతాడు.

ఇక గోల్కొండ కులీ కుతుబ్ షా, బీజాపూర్ అదిల్షా లతో వీళ్ళ యుద్దాలు చరిత్రలో పుంఖాను పుంఖాలు. ఇవంతా మనకు, మన పుస్తకాల్లో చెప్పరు. అక్బర్ తెలుసు, మనరాజు ఎవరో, మనల్ని మనం పరిపాలించిన రాజులు మనకు తెలీదు, చెప్పలేదు, నేర్చుకోలేదు.

1604 లొనే 'వెల్లూరు' పై దండెత్తి దాన్ని తన రాజ్యం లో కలిపేసుకొని, రెండవ రాజధానిగా  చేసుకొంటాడు వెంకటపతి రాయలు....అంటే విజయ నగరానికి తమిళ భాష మాట్లాడే వెల్లూరు నాలుగో రాజధాని అయింది.

అప్పటి నుంచి, వెల్లూరు, "రాయ వెల్లూరు" అయింది....

వెంకటపతి రాయలు  పరిపాలించే రాజ్యాలు సామంతులు అందరూ, తమిళ కన్నడ రాజ్యాలు, ఇప్పటి కర్నూల్, అనంతపూర్ కడప, నెల్లూరు జిల్లాలు మాత్రమే తెలుగు జిల్లాలు, రాజధాని తమిలానికి దగ్గరలో వున్న చంద్రగిరి...

గోల్కొండ, బీజాపూర్ , విజయనగరానికి 1600 సంవత్సరానికి కృష్ణా తీరం మూడు రాజ్యాలకి బార్డర్...అంటే ఇప్పటి గుంటూరు, అంటే కొండవీడు, ఇప్పటి  విజయవాడ, అంటే కొండపల్లి కూడా అప్పటికే కుతుబ్ షా కిందకు వెళ్లిపోయాయి. కర్నూల్ కృష్ణ నది దాటిన తర్వాత, ఇప్పటి "ఆదోని" ప్రాంతం 1568 లొనే బీజాపూర్ వశం అయిపోయింది.

ఇదంతా ఎందుకంటే, తిరుపతి అంటే పది మైళ్ళ దూరంలో ఉన్న చంద్రగిరి నుంచి దాదాపు ఇప్పటి కేరళ ( తిరువాన్కూరు) తప్ప, దాదాపు దక్షిణాపథం అంతటినీ, పరిపాలించిన చివరి "దక్షిణాపద చక్రవర్తి" , విజయనగర చక్రవర్తి, అరవీటి వెంకటపతి రాయలు....ఇతను, శ్రీకృష్ణదేవరాయల మనవడు, అంటే రెండో కూతురి బిడ్డ.

అప్పటికే వున్న పోర్చుగీస్ వారిని మద్రాస్ సాంథోమ్ కోటకి పర్మీషన్ ఇచ్చిన వాడు..., పులికాట్ లో మొదటగా డచ్ వారికి అనుమతి ఇచ్చిన వాడు మచిలీ పట్నంలో అప్పటికే చిన్న ట్రేడింగ్ సెంటర్ ఉన్న ఇంగ్లీష్ వారికి, చెన్నపట్నం ఇచ్చిన వాడు...కానీ ఆ ఒప్పందం సంతకాలు అయ్యే లోపే వెంకటపతి రాయలు చనిపోతాడు. ఆ తర్వాతగా పదిహేను సంవత్సరాలకు, మూడవ రామదేవ రాయలు, 1530 లో చెన్నపట్నం , ఇప్పటి మద్రాసు, లో అనుమతి ఇస్తారు....ఈ ఒప్పందం జరిగింది ఇప్పటి చంద్రగిరి కోటలో...

1614 అక్టోబరులో వెంకటపతి రాయలు చనిపోతాడు. వారసుల మధ్య రాజ్యం కోసం కొట్లాటలు, భారత దేశం లో ఇప్పటి దాకా పాల్గొన్న మనుష్యుల పరంగా జరిగిన "అతి పెద్ద యుద్ధం" - 1617 లో Battle of Thoppur" - దక్షిణాపథం అంతా ఈ యుద్ధం లో పాల్గొనింది...( Don't wonder , you obviously will not know about this battle, we only will know about battle of Plassey, Buxar, Haldighat etc, . Our left historians who wrote and rewrote our NCERT books what we read in our schools will not talk about all these wars except a page about Krishna deva raya. But some good Samaritan has put very briefly about this Topper war in Wiki. But there are several pre independence publications by University of Madras, Annamalai University, which mentions in detail about Venkata pathi Raya and all his exploits and these battles )

తిరుమల కి మనం చాలా సార్లు వెళ్లుంటాం. మహాద్వారం దాటగానే కుడి వైపున (దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఎడమవైపు), శ్రీ కృష్ణ దేవరాయలు విగ్రహం చూసుంటాం, ఇద్దరు దేవేరులతో సహా. ఆహా శ్రీ కృష్ణ దేవరాయలు అనుకొంటూ వచ్చేస్తాం.

కానీ దర్శనం కోసం వెళ్ళేటప్పుడు, బంగారు వాకిలి కంటే చాలా ముందే..., కళ్యాణోత్సవ ప్రాంగణం వైపు పోయే దారిలో, ధ్వజ స్థంభం ఎదురుగా ఒక పెద్ద విగ్రహం వుంటుంది, గమనించారా....పైన పేరు కూడా వ్రాసి ఉంటుంది, " వెంకటపతి రాయలు" అని.... గమనించారా.... బహుశా దర్శనానికి పోయే తొందరలో చూడమేమో.

ఆ చక్రవర్తే మన తెలుగు చరిత్ర....! 

దాదాపు దక్షిణాపధ చరిత్రనంతా ఒక అరవై సంవత్సరాల పాటు శాశించిన ప్రదేశం తిరుపతి శాశించిన రాజు, విజయనగర చక్రవర్తి వెంకటపతి రాయలు.

దక్షిణాపథ చివరి చక్రవర్తి, వెంకటపతి రాయ.

అచ్చ తెలుగోడు. నాన్న తిరుమల రాయలు, పేద నాన్న ఆళియ రామ రాయలు ( తళ్లికోట యుద్ధంలో ఓటమి పొందిన) ఇద్దరూ నంద్యాల వాస్తవ్యులు...శ్రీ కృష్ణ దేవరాయలు ఇద్దరు కూతుర్లను పెళ్లి చేసుకున్న అన్నదమ్ములు , తిరుమల రాయల నాలుగో కొడుకే వెంకటపతి రాయలు.

1565 లో తళ్లి కోట యుద్ధంలో విజయనగర ఓటమి, హంపీ విధ్వంసము తర్వాత, తిరుమల రాయలు ఆ రాత్రికే పెనుకొండకు వెళ్ళిపోయి, అక్కడ నుంచి పరిపాలన మొదలుపెట్టి, దాదాపు, శ్రీ కృష్ణ దేవరాయలు కాలంలో ఉన్న రాజ్య విస్తీర్ణంలో 70 శాతం రాజ్యంతో, అప్పటి నుంచి 80 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యం పరిఢవిల్లింది....1585 నుంచి 1614 వరకు దక్షిణాదిలో ఎనభై శాతం భూభాగాన్ని సామంతులుగా పరిపాలించింది. దానిలో 50 సంవత్సరాల పాటు, చంద్రగిరి, అంటే తిరుపతి రాజధాని....!!


రచన

Neelayapalem Vijay Kumar

Post a Comment

0 Comments