GET MORE DETAILS

గానుగ చెట్టు (కానుగ లేక ‘కానుగు) - ఆయుర్వేదంలో ఉపయోగం

 గానుగ చెట్టు (కానుగ లేక ‘కానుగు) -  ఆయుర్వేదంలో ఉపయోగం

                                                


దీనిని ప్రస్తుతం అందరూ గానుగ చెట్టు అంటున్నారు గానీ దీని అసలుపేరు కానుగ లేక ‘కానుగు’. ఆ శబ్దాల మొదటి రూపం ‘క్రానుగ’ లేక ‘క్రానుగు’.  నీడనిచ్చే వృక్షాలలో ఇది శ్రేష్ఠమైనది. ‘ కానుగ నీడ- కన్నతల్లి నీడ’ అనే లోకోక్తి  అందుకే ఏర్పడింది.రోడ్ల కిరువైపులా నీడ కోసంరహదారి  వృక్షాలు( Avenue Trees)గా గానుగ చెట్లను పెంచుతారు.

 గానుగ గింజలను పొడిచేసి, జ్వరహారిణి (Febrifuge)గానూ, బలవర్ధకంగానూ వైద్యంలో ఉపయోగిస్తారు. బ్రాంఖైటిస్, కోరింత దగ్గులకు కూడా ఈ చూర్ణం బాగా పనిచేస్తుంది. కాయల పై పెచ్చును పొడి చేసి కూడా ఇందుకోసం ఉపయోగిస్తారు. పప్పును మెత్తని పేస్టుగా చేసి, కుష్ఠు పుండ్లకు, మొండి చర్మ వ్యాధులకు పైపూతగా ఉపయోగిస్తారు. కీళ్ళ వాతంలో వాచి, నొప్పిగావున్నకీళ్ళ మీద ఈ పేస్టు రాస్తే చక్కటి ఉపశమనం పొందవచ్చు.పొట్టలో గాస్ చేరి బాధపడే రోగులకు గానుగ గింజల కషాయం ఇస్తే కడుపులోని గాస్ వెంటనే బయటికి వెడలిపోతుంది. గానుగ గింజల్ని చేప విషంగానూ ఉపయోగిస్తారు.

కానుగ గింజల నూనెలో ఉండే ‘కరంజిన్’ అనే పదార్థం స్కేబీస్,హెర్పెస్, ల్యూకోడెర్మా వంటి మొండి చర్మ వ్యాధుల్నిసైతం మాన్పుతుంది.

1. కానుగ నూనెను నువ్వుల నూనె లేక కొబ్బరి నూనెతో కలిపి పైపూతగా  వాడుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఋజువైంది. ఈ నూనెను కొద్ది మోతాదులో లోనికిస్తే పొట్టకు బలమిస్తుంది. కాలేయం సరిగా పనిచేయక అగ్నిమాంద్యం (Dyspepsia)తో బాధపడుతున్న రోగికి ఈ నూనె లోనికిస్తే, అది పసరు తిత్తి (Gall Bladder)ని ప్రేరేపించి,  దాన్ని సంకోచింపజేయడం ద్వారా పైత్యరస (Bile Juice)  ప్రవాహాన్ని అధికం చేస్తుంది.దాంతో రోగికి జీర్ణ శక్తి క్రమంగా మెరుగుపడుతుంది. ఈ నూనెను నిమ్మరసంతో కలిపి కీళ్ళ వాతంలో పైపూతగా రాస్తే నొప్పులనుంచి ఉపశమనం లభిస్తుంది.

 2. గానుగ నూనెలో  క్రిమికీటకాలు, చీడపీడలను నశింపజేస్తుంది. దానిని రైతులు పంటలపై స్ప్రే చేస్తారు. కాఫీ పంటపై ఆశించే ‘గ్రీన్ బగ్’(Green Bug) నివారణకు గానుగ నూనెను పిచికారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.  గానుగ  గింజలనుంచి నూనె తీసిన తరువాత లభించే చెక్క (Oil Cake) చేదుగా ఉంటుంది కనుక అది పశువుల దాణాగా పనికిరాదు. దానిలో అత్యధికంగా ఉన్న నత్రజని కారణంగా అది పంటలకు ఎరువుగా మాత్రం బాగా పనిచేస్తుంది. పైపెచ్చు గానుగ చెక్క  వేసిన పొలంలో రసాన్ని పీల్చి, చెరకు పంటకు హానికలిగించే  ఎర్ర చీమలు చేరకుండా  అది వికర్షిస్తుంది కనుక కర్ణాటకలోని చెరకు రైతులు తమ చెరకు తోటలలో ఈ చెక్కనే  తరచు ఎరువుగా  వాడుకుంటారు.

3. కానుగ కలప తెల్లగా ఉంటుంది. అది పెద్దగా మన్నికైంది కాదు. సమాధులలో శవాల పెట్టెలకు ఈ కలప వాడితే అవి రెండేళ్ళలోపే  డుల్లిపోతాయి. అన్ని రకాల క్రిమికీటకాలు ఈ కలపను తేలిగ్గా తొలిచేసి పాడు చేస్తాయి. అయితే వాటర్ సీజనింగ్ ప్రక్రియ ద్వారా ఈ కలప మన్నికను కొంతమేరకు పెంచుకోవచ్చ  గ్రామీణులు బండి లాగే  దున్నలు లేక ఎడ్ల మెడలపై వేసే కాడి తయారీకి కానుగ కలపను ఎక్కువగా వాడుకుంటారు.నాగళ్ళు, బండి చక్రాల తయారీకీ  ఈ కలప వాడతారు. పూరిళ్ల నిర్మాణంలో వాసాలుగా కూడా ఈ కలపను ఉపయోగిస్తారు. 


4. పచ్చి గానుగ పుల్లలు విరిచి పండ్లు తోముకునే ‘ముఖం పుల్లలు’ లేక ‘పందుం పుల్లలు’(Teeth Cleaning Twigs) గా ఉపయోగిస్తారు. గానుగ పుల్లలతో పళ్ళు తోముకుంటే, కొన్ని గంటలపాటు నోరంతా ఘాటుగా, తిమ్మిరిగా, రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. గానుగ బెరడులోని ‘ఫ్లావోన్’(Flavones)లే  దీనికి కారణం. 

 5. గానుగ ఆకుల్ని లు కడుపు ఉబ్బరం, అగ్నిమాంద్యం, నీళ్ళ విరేచనాలు, దగ్గు మొదలైన వాటికి లేత గానుగ  ఆకుల రసాన్నిలోనికిస్తారు. 6.- కుష్ఠు, గనేరియాలకు కూడా గానుగ ఆకుల రసం చక్కగా పనిచేస్తుంది.

7. కీళ్ళ నొప్పులు ఉన్న వ్యక్తులు మసిలే నీళ్ళలో లేత గానుగ ఆకులు వేసి, తరువాత ఆ నీళ్ళతో స్నానం చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.  8.-  చీము కారుతున్న పుళ్ళు, గాయాలను   శుభ్రపరచడానికి కూడా గానుగ ఆకుల రసాన్ని వేడి నీటిలో కలిపి, ఆ నీటితో కడుగుతారు.రోజూ ఉదయం పరగడుపునే ఒక లేత గానుగ ఆకు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

9. IBS  సమస్య ఉన్నారు కు మరియు సుఖవిరేచనం అవుతుంది.

10. క్రిమిదోషం, అగ్నిమాంద్యం, కడుపు ఉబ్బరం, నీళ్ళ విరేచనాలు, కుష్ఠు, గనేరియా, దగ్గు మొదలైనవాటినుంచి ఉపశమనం లభిస్తుంది.

11. గానుగ వేళ్ళతో పళ్ళు తోముకుంటే చిగుళ్ళు గట్టి పడతాయి. గానుగ వేళ్ళ  రసంతో చీము కారే పుళ్లు, గాయాలు  శుభ్రపరుస్తారు.

12. గనేరియాకు కూడా గానుగ వేళ్ళ రసం బాగా పనిచేస్తుంది. గానుగ వేళ్ళను మెత్తగా నూరి, ఆ పేస్టును గండమాల వ్యాధి (Scrofula) లో పై పూతగా వాడితే ప్రయోజనం ఉంటుంది.

13.  కానుగ కాండం బెరడులో ఉండే పీచు నుంచి నార తీస్తారు. రక్తం కారుతున్న పైల్స్ (మూల వ్యాధి) లో  కానుగ బెరడు  తాజా రసాన్ని లోనికిస్తే రక్తస్రావం ఆగిపోతుంది.

14. కాండం రసం యొక్క కషాయం తాగిస్తే బెరి బెరి  (థయామైన్ లేక విటమిన్ B 1 లోపంతో వచ్చే వ్యాధి )తో బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది. అది కడుపులోని క్రిముల్ని నశింపజేస్తుంది. బిహార్ లో ఈ బెరడును మెత్తగా తొక్కి గేదె దూడలకు తినిపిస్తే అవి క్రమంగా పాలు తాగడం తగ్గిస్తాయట.

 15. షుగర్ వ్యాధిగ్రస్థులకు దాహార్తి (dipsia)ని పోగొట్టడానికి గానుగ పూల కషాయం తాగిస్తారు

16. కానుగ చెట్టు స్త్రీ లో వాత రోగాలనూ,యోని రోగాలనూ తెల్ల బట్ట సమస్య ను పోగొడుతుందనీ పలు ఆయుర్వేద వైద్యశాస్త్ర గ్రంథాలు పేర్కొన్నాయి. గానుగ చెట్టును  ‘కుష్ఠ జిత్’  (కుష్ఠును జయించేది) అనే మరొక పేరుతో కూడా కొన్ని గ్రంథాలు పేర్కొనడం  గమనార్హం.

ఇలా ఎన్నెన్నో ప్రయోజనాలున్న కానుగ చెట్లు ఎందుకూ పనికిరాని నేలలలో కూడా చక్కగా  పెరుగుతాయి. మనం వాటికి ఎలాంటి ప్రత్యేక పోషణ చెయ్యనవసరంలేదు  కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం?,కనుక ఈ సత్కార్యం తలపెట్టినందుకు  ముందు తరాలవాళ్ళు మీ పేరు చెప్పుకుంటారు.

Post a Comment

0 Comments