నడుము నొప్పి నివారణకు ఆయుర్వేదం
1. నడుము మహారాస్నాది తైలాన్ని తెచ్చి నడుముకు పూయాలి.
సన్న రాష్ట్రం , పల్లేరు కాయలు , ఆముదం చెట్టు వేర్లు , దేవదారు చెక్క , తెల్ల గలిజేరు వేర్లు , రేల కాయల చెట్టు బెరడు.
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణంతో కషాయం కాచి దానిలో ఒక టీ స్పూను శొంటి పొడిని కలిపి తాగితే ఎటువంటి నడుము నొప్పి వున్నా తప్పక నివారింపబడుతుంది.
2. నడుము మీద పట్టు వేయడానికి :
గురిగింజలను నానబెట్టి మెత్తగా నూరి గుడ్డ మీదపూసి నడుము మీద నొప్పి వున్నచోట పరచాలి.
3. నడుము నొప్పి నివారణకు ఉమ్మెత్త :
ఉమ్మెత్త లో 3 రకాలు వుంటాయి : తెల్ల ఉమ్మెత్త , నల్ల ఉమ్మెత్త , పసుపు ఉమ్మెత్త.
రెండు పిడికెళ్ళ బియ్యాన్ని నీటిలో నానబెట్టాలి . తరువాత బాగా నాననిన తరువాత ఆ బియ్యంలోని నీటిని వంచేసి వాటిలో 4, 5 నల్ల ఉమ్మెత్త ఆకులను వేసి మెత్తగా నూరితే జిగటగా తయారవుతుంది . దానిని ఒక బట్టపై పూసి నడుము పై పరచాలి . ఈ విధంగా 4, 5 సార్లు చేసేటప్పటికి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది .
ఉమ్మెత్త రసం , నువ్వుల నూనె రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి నూన పూర్తిగా తేమ ఇంకి పోయి నూనె మాత్రమె మిగిలే విధంగా కాచాలి.
ఈ తైలం తో నడుము మీద నొప్పి వున్నచోట మర్దన చేస్తూ వుంటే నొప్పి తగ్గుతుంది.
0 Comments