GET MORE DETAILS

ఆషాఢమాసం – శ్రీ వారాహి నవరాత్రి

ఆషాఢమాసం – శ్రీ వారాహి నవరాత్రి



మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలితాదేవి యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు.

అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి), ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది…ఇది మహావారాహి(బృహద్వారాహి) యొక్క స్వరూపం…ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.

వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి…ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది…వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే…రోకలి ధాన్యం నించి పొట్టు వేరు చేయడానికి వాడుతారు…అలగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది నాగలి భూమిని విత్తనం వేసేముందు తయారు చేయడానికి వాడతాం. అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామకర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది.

పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి…శ్రీ విద్యా గద్యంలో “అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే” అని లలితను కీర్తిస్తారు దేవీ కవచంలో “ఆయూ రక్షతు వారాహి” అన్నట్టు ఈ తల్లి ప్రాణ సంరక్షిణి ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం

ప్రకృతి పరంగా చూసినట్లైతే ఈ సమయంలో వర్షం కురుస్తుంది…రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది.

అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి ముఖ్య ప్రాణ రక్షిణి.

హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామాలు :

- పంచమి

- దండనాథా

- సంకేతా

- సమయేశ్వరి 

 -సమయ సంకేతా

- వారాహి 

-పోత్రిణి

- వార్తాళి

- శివా

- ఆజ్ఞా చక్రేశ్వరి 

- అరిఘ్ని

దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా చల్లగా ఉండాలని ధర్మం వైపు మనం నడవాలని అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం.

ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా 

ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ

సర్వం శ్రీవారాహి(దండిని) చారణారవిందార్పణమస్తు…!

నవరాత్రులు ఈ నెల జూన్30 వ తారీకు నుండి మొదలవుతున్నాయి జులై 8 వ తారీకు తో ముగుస్తున్నాయి.

Post a Comment

0 Comments