GET MORE DETAILS

గ్రహణాలు ఎలా సంభయిస్తాయి ?

గ్రహణాలు ఎలా సంభయిస్తాయి ?



అమావాస్య రోజు సూర్య గ్రహణం, పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం అవి భ్రమణం చెందే కక్షలు వలన గ్రహణాలు సంభాయిస్తాయి.

 సూర్యుడు, చంద్రుడు, భూమి సరిగ్గా ఒకే కక్ష్యలో లేనప్పుడు.. సూర్యుడి ఉపరితలంలో కొంత భాగం చీకటిగా మారినప్పుడు పాక్షిక సూర్య గ్రహణంగా పేర్కొంటారు. పాక్షిక సూర్య గ్రహణంలో ఆరంభం, గరిష్ఠం, ముగింపు అని మూడు భాగాలు ఉంటాయి. ఆరంభంలో చంద్రుడు సూర్యుడి డిస్క్ లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత సూర్యుడిలో అధిక భాగాన్ని కప్పేస్తాడు. ఆ తర్వాత క్రమంగా పక్కకు జరుగుతాడు.

మూఢ నమ్మకాలు :

రాహువు,కేతువు అనే పాము మింగడం వలన గ్రహణాలు వస్తాయి అనేది పూర్తిగా మూఢ నమ్మకం. అట్టి దానికి ఎటువంటి శాస్త్రీయ దృక్పథం, ఆధారాలు లేవు. ఆహార పదార్థాలు తినరాదు, సంప్రోక్షణ, శుద్ధి కూడా మూఢ నమ్మకం. కాని సరియైన లెన్స్ లేకుండా కంటితో చూడటం, గర్భిణీ స్త్రీలు ఎక్స్పోజ్ కావడం వలన కాస్మిక్ రేస్ మరియు సూర్యుని నుండి వెలువడే  ఇతర ప్రమాదకరమైన కిరణాలు వలన పెరుతున్న పిండం, కంటి పై ప్రబావం చూపుతాయి.

నేటి గ్రహణం విదేశాలలో...

27సంవత్సరాల తరువాత నేడు పాక్షిక సూర్య గ్రహణం సంభయిస్తున్నది. మళ్లీ పాక్షిక సూర్యగ్రహణం 2025 మార్చి 29న చోటు చేసుకోనుంది. కాకపోతే దీన్ని మన దేశంలో వీక్షించలేం. తిరిగి 2032 నవంబర్ 3న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుంది.

కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ప్లానిటోరియం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో సూర్యాస్తమయానికి ఒక గంట ముందు కొన్ని నిమిషాల పాటు పాక్షిక సూర్య గ్రహణం కనిపించనున్నట్లు పేర్కొంది. పోరుబందర్, గాంధీ నగర్‌, ముంబై, శిల్వాసా, సూరత్‌, పనాజీ ప్రాంతాల్లో సూర్యగ్రహణం కనిపించనున్నట్లు తెలిపింది. గరిష్ఠంగా ఒక గంట 45 నిమిషాల పాటు పాక్షిక సూర్యగ్రహణం కనబడుతుంది. అందులో ఎక్కువ సమయం గుజరాత్‌లోని ద్వారకాలో కనువిందు చేయనుంది. ఢిల్లీలో అయితే సాయంత్రం 4:29 గంటల నుంచి 5:30 గంటల వరకు గ్రహణం కనిపించనుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అయితే సాయంత్రం 4:59 గంటలకు గ్రహణం కనిపించనుంది. కనీసం 49 నిమిషాల పాటు కనివిందు చేయనుంది.

అయితే ఈ సమయంలో 43 శాతం సూర్యుడిని అస్పష్టంగా చూడగలుగుతామని చెప్పింది. పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించాలనుకునే వారు తప్పనిసరిగా సోలార్ గాగూల్స్ ను ఉపయోగించాలి. ఇక ఐజ్వాల్, దిబ్రుగర్హ్‌, ఇంఫాల్ ఇటానగర్ కోహిమా, సిల్చార్‌, అండమాన్ నికోబార్ దీవుల్లో గ్రహణం అసలే కనబడదు.

Post a Comment

0 Comments