GET MORE DETAILS

'కీర్తిచక్ర’ పురస్కారం పొందిన మొదటి సైనికేతర పౌరుడు శ్రీ వాడిపల్లి వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా...

'కీర్తిచక్ర’ పురస్కారం పొందిన మొదటి సైనికేతర పౌరుడు శ్రీ వాడిపల్లి  వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా...



భారతదేశంలో వున్న అత్యున్నత పురస్కారాలలో ‘కీర్తిచక్ర’ రెండవది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికాధికారులకు మాత్రమే ఈ విధమైన పురస్కారాన్ని అందజేస్తారు. కానీ.. ఓ సైనికేతర పౌరుడైన వాడిపల్లి వెంకటేశ్వరరావు మొట్టమొదటిసారిగా ఆ పురస్కారాన్ని పొందారంటే.. ఆయన ఏ విధమైన పదవీ బాధ్యతలు చేపట్టారో, ఎంత సమర్థవంతంగా తమ విధి నిర్వహించారో తెలుసుకోవాల్సిందే..!

బాల్యం-విద్యాభ్యాసం:

1963 ఆగష్టు 26వ తేదీన తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో వాడపల్లి అప్పలాచార్యులు, సుభద్ర దంపతులకు వి.వి.రావు జన్మించారు.తండ్రి వాడపల్లి అప్పలాచార్యులు రిటైర్డ్ హెల్త్ ఎక్స్ టెన్షన్ అధికారి. వి.వి.రావు తన జన్మస్థలం నందే ఎస్.ఎస్.సి.వరకు చదివారు. ఆ తర్వాత ఎ.పి.ఆర్.జె.సి. నాగార్జున సాగర్ లో ఇంటర్మీడియట్ 1978-80లో పూర్తిచేశారు. #వాడ్రేవు చినవీరభద్రుడు కూడా వీరి #సహాధ్యాయి. చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండే ఈయన.. ఎంట్రన్స్ ద్వారా కర్నూలులో వుండే సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఎ.గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.సివిల్ సర్వీసెస్ లో టాపర్ గా నిలవడమే తన ధ్యేయమని తన సిల్వర్ జూబ్లీ కళాశాల మిత్రులతో వి.వి.రావు చెప్పడం వల్ల అందరూ వి.వి.రావును పేరుతో కాకుండా "టాపర్" అని పిలిచేవారు. సిల్వర్ జూబ్లీ కళాశాలలో వి.వి.రావు తన జీవిత గమనమును నిర్ణయించుకొని అక్కడి చక్కటి వాతావరణాన్ని తన మేధస్సు అభివృద్ధికి ఉపయోగించుకున్నాడు.

1983 నుండి 1985 సం.లో హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి ఎం.పిల్ పూర్తిచేశారు. ఆ తర్వాత అదే విశ్వవిద్యాలయం నుండి ఆసియా దేశాలతో భారతీయ సంబంధాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ సంపాదించాడు.

ఇండియన్ ఫారిన్ సర్వీస్ ను ఎంపిక:

1990 సంవత్సరంలో సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై ఆప్షంస్ లో ఐ.పి.ఎస్./ఐ.ఎఫ్.ఎస్. లకు అవకాశం వుండగా తండ్రి అప్పలాచార్యులు సలహా మేరకు, తనకు అప్పటికే ప్రపంచదేశాలతో భారత సంబంధాలపై పరిశోధన ద్వారా మంచి పట్టు వుండడం, ప్రపంచదేశాలలో నిత్య ప్రయాణీకుడిగా ఉండాలనే తన అభీష్టం మేరకు ఇండియన్ ఫారిన్ సర్వీస్ ను ఎంపిక చేసుకున్నారు.

వి.వి.రావు కీర్తిచక్ర పురస్కారం సాధించిన వైనం:

ఉన్నత విద్యను అభ్యసించిన ఈయనకు ప్రపంచదేశాలలో నిత్య ప్రయాణీకుడిగా ఉండాలనే కోరిక వుండేది. ఆ కోరిక మేరకే ఈయన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ను ఎంపిక చేసుకున్నారు. తొలుత ఈయన జర్మనీలోని భారత రాయభార కార్యాలయంలో ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత శ్రీలంక, నేపాల్, భూటాన్, ఇండియా, అమెరికా వంటి దేశాలలో 1990 నుండి 2005 వరకు పనిచేశారు. ఆఫ్ఘనిస్తాన్ లోని రాయబార కార్యాలయంలో పనిచేయడానికి ఎందరో విముఖత చూపిన సమయంలో భారత ప్రభుత్వం ఆ పదవికి వి.వి.రావును నిర్ణయించింది. విధి నిర్వహణలో మంచి పట్టుదల, సమర్ధత కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన ఆయన.. ప్రభుత్వం తన భుజస్కందాలపై వుంచిన బాధ్యతలను ఒక సవాలుగా తీసుకొని అక్కడ చేరారు.

అక్కడి కాబూల్ లోని భారత రాయబార కార్యాలయంలో కన్సులేట్ గా 3 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఆఫ్ఘనిస్తాన్ లోని ముఖ్యమైన భాషలలో ఒకటైన "దారి" భాష యందు చక్కటి పట్టువున్న వి.వి.రావు ఇరుదేశాల బంధాన్ని ఇనుమడింపజేశారు

2008 జూలై 7వ తేదీన కాబూల్ లోని భారత రాయబార కార్యాలయం ముందు జరిగిన తీవ్రవాదుల ఆత్మాహుతి దాడిలో మొత్తం 41 మంది మృతి చెందగా.. అందులో భారత్ రక్షణ విభాగానికి చెందిన బ్రిగేడియర్ మెహతాతో పాటు మరో ముగ్గురు కార్యాలయ సిబ్బంది మరణించారు. వారితోపాటు మరణించిన వారిలో భారతీయ దౌత్యవేత్త అయిన 54 యేళ్ళ వాడపల్లి వెంకటేశ్వరరావు వున్నారు. ఆ విధంగా అమరులైన ఈయనకు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికాధికారులకు ఇచ్చే కీర్తిచక్ర పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ విధంగా కీర్తిచక్రతో గౌరవించబడిన మొట్టమొదటి సైనికేతర భారతీయుడిగా గుర్తింపు పొందారు.

ధర్మపత్నికిసమానమైన హోదా:

వి.వి.రావు గారి పదవిని సమానమైన హోదా కలిగిన భారతీయ సాంస్కృతిక సంస్థ, బ్యాంకాక్ కు డైరెక్టర్ గా పదవీ బాధ్యతలను ఆయన ధర్మపత్ని వాడపల్లి మాలతీరావుకు భారత ప్రభుత్వం అప్పగించి గౌరవించింది.ఈ బాధ్యతలను స్వీకరించక ముందు మాలతి ఢిల్లీలో గల విదేశి వ్యవహారాల అధికారులు వారి పిల్లల చదువుకోసం ఏర్పాటుచేసుకున్న స్వచ్ఛంద సంస్థకు చెందిన సంస్కృతీ స్కూల్ లో మానసిక వికలాంగులకు బోధించే ఉపాధ్యాయని.

దౌత్యనీతిలో పేరుపొందిన తెలుగు తేజం వాడపల్లి వెంకటేశ్వరరావు గారు బౌతికంగా దూరమైన  భారతీయుల ఎప్పటకీ మరచి పోలేరు.

_Collected by 

Dr.A.Srinivasa Reddy

Post a Comment

0 Comments