GET MORE DETAILS

మునగాకు టీతో థైరాయిడ్ సమస్య మటాష్

 మునగాకు టీతో థైరాయిడ్ సమస్య మటాష్



థైరాయిడ్ కు మునగాకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మన శరీర పనితీరుపై హార్మోన్ల ప్రభావం చాలానే ఉంటుంది. ముఖ్యంగా మన గొంతుభాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథికి మేలు చేయాలంటే మునగాకును ఆహారంలో చేర్చుకోవాలి.

గొంతుభాగంలో వుండే థైరాయిడ్ గ్రంథి పని తీరులో తేడాల వల్ల థైరాయిడ్ సమస్య ఎదురవుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి "హైపో థైరాయిడిజం". ఈ రోజుల్లో దీని బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని అదుపులో ఉంచాలంటే వైద్యులు సూచించిన మాత్రలతోపాటు ఆహారపరంగానూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

అందుకే మునగాకుతో చేసే వంటకాలను తీసుకోవాలి. మునగాకుతో రొట్టెలు, తాలింపు వంటివి వారానికి మూడుసార్లైనా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మునగాకు రెండు గ్లాసుల నీటిలో బాగా ఉడికించి ఆ నీటిని వడగట్టి రోజూ గ్లాసుడు తీసుకుంటే థైరాయిడ్ సమస్య దరిచేరదు. పాలకన్నా అనేక రెట్లు ఎక్కువ క్యాల్షియం మనకు మునగాకు ద్వారా లభిస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్లలకు మంచిది.

Post a Comment

0 Comments