GET MORE DETAILS

White Lung Syndrome: ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైట్ లంగ్ సిండ్రోమ్ వ్యాధి. చిన్నపిల్లల్లో తీవ్ర ప్రభావం

 White Lung Syndrome: ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైట్ లంగ్ సిండ్రోమ్ వ్యాధి. చిన్నపిల్లల్లో తీవ్ర ప్రభావం



ఈమధ్య కాలంలో సరికొత్త వైరస్, బ్యాక్టీరియాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటన్నింటికీ మూలం చైనా అనే చెప్పాలి. తాజాగా మరో కొత్త వ్యాధి చైనాలోనే ఉద్భవించడం చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఒకరకమైన బ్యాక్టీరియా అని తేలింది. న్యూమోనియా వ్యాధిని మరింత తీవ్రంగా వ్యాప్తి చేసేలా ఉందని గుర్తించారు శాస్త్రవేత్తలు. చైనాలో ఉద్భవించిన ఈ వ్యాధి డెన్మార్క్, అమెరికా, నెదర్లాండ్స్‌కు వ్యాపించినట్లు తెలుస్తోంది.

దీనికి వైట్ లంగ్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు. ఈ వ్యాధి ఎక్కువగా మూడు నుంచి ఎనిమిదేళ్ళ వయసుగల పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. ‘వైట్ లంగ్ సిండ్రోమ్ న్యుమోనియా’ – స్కాన్‌ చేసినప్పుడు ఊపిరితిత్తులు ఎలా దెబ్బతిన్నాయో చెప్పేందుకు.. మైకోప్లాస్మా న్యుమోనియాను ఆధారంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదో రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ.. యాంటీబయాటిక్స్‌తో పోరాడే శక్తి లేదని స్పష్టమవుతోంది.

డెన్మార్క్‌లోని చిన్నపిల్లల్లో న్యుమోనియా కేసులు అధికంగా నమోదవడమే కాకుండా.. అది అంటువ్యాధి స్థాయికి చేరుకుంటున్నాయని ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్‌కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయంటున్నారు. నెదర్లాండ్స్, స్వీడన్‌లో కూడా చిన్నపిల్లలకు న్యుమోనియా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోందని బాధపడుతున్నారు.

ఈ వ్యాధి దగ్గు, తుమ్ము, మాట్లాడటం, పాడటం తో పాటూ శ్వాస తీసుకోవడం ద్వారా వ్యాపిస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మమైన బిందువులు రెస్పిరేటరీ సిస్టం ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందని తెలుస్తోంది. ఒహియోలోని అనేక ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. యునైటెడ్ స్టేట్స్‌లో అనారోగ్యం బారిన పడి ఆసుపత్రుల్లో చేరే చిన్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు.

యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ నివేదిక ప్రకారం, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారు చైనాతో కమ్యూనికేషన్‌లో ఉన్నారని, దేశంలో ఇటీవలి శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలకు ఒక బ్యాక్టీరియా కారణమని గుర్తించారు. ముఖ్యంగా చైనా ఉత్తర భాగంలో అధికంగా ఈవ్యాధి బారిన పడుతున్నట్లు కనుగొన్నారు. సీడీఎస్ డైరెక్టర్ మాండీ కోహెన్, హౌస్ సబ్‌కమిటీకి చెప్పారు.

వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి?

వైట్ లంగ్ సిండ్రోమ్ అనేది న్యుమోనియా వ్యాధికి తీవ్రమైన రూపంగా చెబుతున్నారు వైద్యులు. ఇది ఊపిరితిత్తుల్లో చేరి మచ్చలు ఏర్పరచడం, రంగు పాలిపోవడానికి కారణమవుతుంది. అనారోగ్యానికి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ తెలియదు, అయితే ఇది బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్‌గా చెబుతున్నారు. ప్రకృతిలోని గాలి ద్వారా ఇది వ్యాపించేందుకు అవకాశం ఉంటుంది.

వైట్ లంగ్ సిండ్రోమ్ లక్షణాలు:

- జ్వరం

- దగ్గు

- శ్వాస ఆడకపోవడం

- ఛాతీ నొప్పి

- అలసట.

Post a Comment

0 Comments