GET MORE DETAILS

ఆరోగ్యమస్తు - మీ ఆరోగ్యం మీ చేతుల్లో : కొన్ని సాధారణ ప్రకృతి చికిత్సలు

ఆరోగ్యమస్తు - మీ ఆరోగ్యం మీ చేతుల్లో : కొన్ని సాధారణ ప్రకృతి చికిత్సలు



◾వేసవికాలంలో...

• నీటిలో మిరియాల పొడివేసి, మరిగించి కాచిన కషాయాన్ని వేసవిలో ప్రతిరోజు తగు మాత్రము త్రాగుతుంటే వేసవి కాలములో వచ్చే గొంతు నొప్పి, జ్వరము, దగ్గు పార్శ్వపు నొప్పి వంటి వ్యాధులు సమసిపోతాయి.

• వీటిలో శొంతివేసి, బాగా మరిగించి కాచిన కషాయాన్ని వేసవిలో ప్రతీరోజూ స్వీకరిస్తూ వుంటే వేసవిలో కలుగు అతితాపము తగ్గిపోవును.

• పిప్పళ్ళు, కరక్కాయ, బెల్లము సమపాళ్ళలో తీసుకొని, కొద్దిగా ఉన్ తింటూ వుంటే వేసవి బాధలకు విరుగుడుగా పనిచేయును.

• అల్లాన్ని చిన్న చిన్న ముక్కలు తరిగి, మెత్తగా నూరిన ఉప్పులో అద్దుకొని ప్రతిరోజూ ఉదయము పూట తింటుంటే ఆకలి పెరిగి, తాపము నివారించును.

•ధనియాల ఒక చెంచా ఒక గ్లాసు నీళ్ళలో వేసి పటిక బెల్లం కలుపుకుని తాగితే తో 

• కషాయము వడదెబ్బ అతివేడిలాటి వేసవి బాధలను వడదెబ్బ తాపములాంటి వేసవి బాధలను నివారించును.

• వడదెబ్బ తాపము లాంటి వేసవి బాధల నివారణకు నిమ్మరసము ఉప్పు కలిపిన పానీయములు అధికముగా త్రాగుట మంచిది. 

• మామిడిరసములో తగు మాత్రం పచ్చకర్పూరం, చక్కెర కలిపి త్రాగిన అతి దాహము, దేహతాపము లాంటి వేసవి బాధలకు దూరముగా వుండవచ్చును.

• వేసవిలో వచ్చే మామిడిలాంటి పళ్ళును విరివిగా తీసుకుంటే వేసవి బాధలకు విరుగుడుగా పనిచేయును.

• పలుచని మజ్జిగలో కొద్దిగా ఉప్పుగానీ, నిమ్మరసరముగానీ కలిపి ప్రతిరోజూ ఉదయము, సాయంత్రము 1 గ్లాసు త్రాగుతూ ఉంటే అతి దాహబాధలు తగ్గిపోతాయి.

• సబ్జా గింజలు ఒక లీటర్ నీళ్లలో రెండు చెంచాల వేసి నానబెట్టి దానిలో ఒక పెద్ద నిమ్మపండు రసం తగినంత పటిక బెల్లం కలుపుకొని దాహం వేసినప్పుడు తాగుతూ ఉంటే అతివేడి తగ్గును.

◾వర్షాకాలంలో...

• జొన్న, మొక్కజొన్న లాంటివి వేయించి, పేలపిండి గొట్టి దీనిలో తగు మాత్రం పంచదార కలిపి ప్రతిరోజూ కొద్దిగా తింటుంటే వర్షాకాలంలో వచ్చే జలుబు. కఫము, విరేచనములు వంటి బాధలకు ఉపశనముగా పనిచేయును.

• వర్షాకాలములో శ్వాసకోశ వ్యాధులు ప్రకోపించుట జరుగును. వీటిని నివారించును నిరోధించుటకు కరక్కాయ చూర్ణములో కొద్దిగా సైంధవ లవణముతో కలిపి ప్రతిరోజూ ఉదయము, రాత్రి పరుండే ముందు కొద్దిగా తింటుంటే మంచి మేలు చేయును.

• వర్షాకాలములో కారం, ఉప్పు, పులుపులాంటి రుచులను మామూలు కంటే తగ్గించి తింటూ ఉండుట వలన దేహారోగ్యము వృద్ధియగును. 

• వానాకాలంలో ఆకుకూరలు, కాయగూరలు, ఆ కాలములో వచ్చే పళ్ళు మొదలైన తేలికగా అరిగే పదార్థాలను అధికముగా తీసుకొంటూ వుంటే జలబు, రొంపలాంటివి దరిజేరవు.

• కరక్కాయ చూర్ణములో తగు మాత్రము బెల్లము కలిపి తింటూ వుంటే వర్షాకాల వ్యాధులకు నిరోధకముగా పనిచేయును.

◾చలికాలంలో...

• శిశిరకాలములో చలి అధికముగా నుండును. గనుక దీనిని నిరోధించుటకు ఉన్ని లాంటి మందపాటి వస్త్రాలను ధరించుట ప్రథమ చికిత్స.

• పాల సుగంధి, కరక్కాయ చూర్ణాలను సమపాళ్ళలో తీసుకొని దీనిలో తగు మాత్రము పంచదార కలిపి సేవిస్తూ వుంటే చలికాల బాధలకు నిరోధకముగా పనిచేయును.

• శొంఠి, కరక్కాయ చూర్ణాలను సమపాళ్ళలో తీసుకొని కొద్దిగా నెయ్యి కలిపి తింటుంటే చలి బాధలు తగ్గును.

• ఈ కాలములో రాత్రి భోజనమ వీలయినంత వరకు ప్రొద్దుపోకుండా తినడము ఉపయోగకరముగా వుంటుంది.

ఆరోగ్యంగా ప్రకృతి నియమాలు:

◾ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు లాంటి శాకాహార పదార్థాలనే భుజించాలి.

◾రెండు పూటలే మితముగా భుజించాలి.

◾దాహమైనా, కాకపోయినా నీరు అధికముగా త్రాగాలి.

◾కాఫీ, టీ మద్యము లాంటి ఉద్రేకము కలిగించే పానీయాలను సిగరెట్, వీడి లాంటి పొగాకుతో తయారైన పదార్థాలను ఉపయోగించరాదు.

◾ఉప్పు, కారము, నూనె లాంటి పదార్థాలను తగ్గించాలి. 15 రోజులకొకసారైనా రసోపవాసము చేయాలి.

◾ఆయా కాలములలో వచ్చే పండ్లు ఎక్కువగా తినాలి. 

◾వారానికొకసారి అభ్యంగన స్నానము చేయాలి.

◾ప్రతిరోజూ ఒక గంటసేపు యోగాసనాలు లాంటి శారీరక వ్యాయామాలు ధ్యానము తప్పక చేయాలి.

◾మనసుకు ఆందోళన, అస్థిమితము చేకూర్చే కార్యక్రమాలను చేయరాదు.

◾రాత్రిపూట 10 గంటలలోపూ నిద్రపోవడము అభ్యాసము చేయండి. మంచినిద్ర శారీకముగానూ, మానసికముగానూ విశ్రాంతి నిస్తుంది.

◾ప్రాతఃకాలములో సూర్యోదయ పూర్వమే 5 గంటలకు నిద్రలేచి కాలకృత్యాది కార్యక్రమాలను పూర్తి చేసుకుని దినచర్యకు పూనుకోండి.

ఆరోగ్య మస్తు యూట్యూబ్ ఛానల్ లో మరిన్ని హెల్త్ టిప్స్ చూడండి.

https://youtu.be/gepe6n5sxhc


Dr. M. Gouthami BAMS, MD (AYU)

D/0 Dr. M Ashok Vardhan Reddy MD(AM)

N.L.P Basic Practitioner

Life skills Coach

Impact certified motivational trainer

Secunderabad      

8500204522

Post a Comment

0 Comments