GET MORE DETAILS

అరోగ్యమస్తు - మీ ఆరోగ్యం మీ చేతుల్లో : నీరు త్రాగు విధానం

 అరోగ్యమస్తు - మీ ఆరోగ్యం మీ చేతుల్లో : నీరు త్రాగు విధానం



"భోజనాంతే విషం వారీ" దీని అర్ధం భోజనం చేసిన వెంటనే నీరు. త్రాగటం, ఇది సూత్రము అంటే భోజనం చివర నీరు త్రాగటం విషంతో సమానము. శరీరంలో ముఖ్యభాగం పొట్ట, పొట్ట భాగం లోపలిస్థానం జఠరాగ్ని అంఏ జీర్ణాశయం. మనం తీసుకున్నఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది. అక్కడ అగ్ని ప్రదీప్తమవుతుంది. ఆ అగ్ని తిన్న ఆహారాన్ని ప్రచనం చేస్తుంది. ఇది ప్రధానమైన విషయం. ఎలా అంటే స్విచ్ వెయ్యగానే లైట్ ఎలా వెలుగుతుందో మనం నోట్లో మొదటి ముద్ద పెట్టుకోగానే లాలాజలం ఊరుతుంది. దానితోపాటుగా జఠరస్థానంలో అగ్ని ప్రజ్వలిస్తుంది. ఆహారాన్ని ప్రచవనం చేస్తుంది. ఇదే సమయంలో మనం గటగటా నీళ్లు త్రాగితే ఏమౌతుంది. జఠరాగ్ని చల్లబడుతుంది.

మండుతున్న కట్టెమీద నీళ్లుపోస్తే ఎలా ఆరిపోతుందో అలాగే మనం భోజనం చేసేటప్పుడు అగ్ని పుడుతుంటుంది. అదే సమయంలో మనం నీళు , త్రాగాలి. కానీ అధికంగా త్రాగరాదు. కొద్దిగా మాత్రమే మనం నీళ్లు త్రాగాలి, కానీ అధికంగా త్రాగారాదు. కొద్దిగా మాత్రమే త్రాగాలి. కొందరైతే లోటాలతో నీరు త్రాగేస్తారు. అన్నంకంటే ఎక్కువ నీరుత్రాగేవారు కూడా ఉన్నారు అలా వెళ్లిన నీరు అగ్నిని చల్ల బరుస్తాయి. ఇక తిన్న భోజనం అరగదు అది కుళ్లిపోతుంది. అదే మొదటి సమస్య గ్యాస్ట్రబుల్. దీనవల్ల గొంతులో మంట, ఛాతిలో మంట, గుండెలో మంట, ఇంకా ఇలా ఈ కుళ్లిన ఆహారం నుండి వచ్చిన గ్యాస్ ఆ విషవాయువు శరీరమంతా వ్యాపిస్తుంది. దీన్ని కంట్రోల్ చెయ్యటం కష్టం ఇలా తయారైన వాయువువల్ల 103 రోగాలు వస్తాయి. ఎసిడిటీ, హైపర్, పెప్టిక్ అల్సర్, ఇంకా ఇలాగే ఎక్కువకాలం పాటు అనుసరిస్తే అర్శమొలలు, మూలవ్యాధి, భగందర రోగము ఇలా చూస్తూపోతే చివరగా వచ్చేది క్యాన్సర్(కర్కాటక రోగం) మనం తిన్న ఆహారం జీర్ణం కాకుండా. నీరుతాగడం వల్ల ఆ ఆహారం కుళ్లి దానివల్ల వచ్చిన వాయువు వల్ల వచ్చే | వ్యాధులు 103. ఇంకా ఆ కుళ్లిన ఆహారం వల్ల వచ్చేది కొలెస్ట్రాల్ నిజానికి ఆహారం పొట్టలో సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు. శరీరంలో రెండురకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. అవి మంచి కొలెస్ట్రాల్ H.D.L. అంటారు. చెడు కొలెస్ట్రాల్ అంటే L.D.L. ఇంకా V.L.D.L అని అంటారు. ఈ చెడు కొలెస్ట్రాల్ భోజనం కుళ్లినప్పుడు మాత్రమే తయారవుతుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది. మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఇలా అనేకం. డాబట్టి భోజనం చేసిన వెంటనే నీరు త్రాగకూడదు.

అలాగైతే మంచినీళ్లు ఎప్పుడు త్రాగాలి ? కనీసం గంటన్నర తర్వాత నీళ్లు త్రాగండి. ఎందుకంటే తిన్న ఆహారం జఠరస్థానంలో గంటన్నర వరకు . అగ్నిప్రదీప్తమై ఉంటుంది. కనుక భోజనం చేసిన ఒకటిన్నర గంటన్నర గంట తర్వాత నీళ్లుత్రాగితే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. మరి భోజనానికి ముందుగానీ, మధ్యలోగానీ నీరు త్రాగవచ్చా అంటే భోజనానికి ఒక గంట ముందు నీరు త్రాగవచ్చును. అవసరమైతే మరి భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే, దీనికి ఎంతో వైజ్ఞానికమైన ఉంది. అది ఏంటంటే? మనం తినే ఆహారంలో రెండు రకాల అన్నము అంటే ఒకటి గోధుమలతో చేసిన చేసిన రొట్టె, రెండవది వరితో చేసిన అన్నం. ఇలా రెండు రకముల అన్నం ఉ అంటే ఇప్పట్లో సహజంగా ఎక్కువ మంది ఇలాగే తింటున్నారు. కాబట్టి వారికోసం. చెప్పుతున్నాను. మొదటి అన్నం పూర్తిచేసి రెండవ రకం అన్నం మొదలు పెట్టే ముందుగా కాస్త నీరు త్రాగవచ్చు. కాస్త అంటే రెండు లేక మూడు గుటకలు ' నీరు త్రాగవచ్చు. ఇక పూర్తిగా భోజనం ముగించే వరకు నీరు త్రాగకూడదు. భోజనం ముగించాక మీగొంతు సాఫీగా ఉంచటానికి రెండు గుటకలు నీరుత్రాగవచ్చును. కేవలం గొంతు శుద్ధికోసమే. మరినీరు కాకుండా మరేదైనా తీసుకోవచ్చునా అంటే మజ్జిగ తీసుకోవచ్చు. దీనికి మరోపేరు తక్రమ అంటే  పెరుగును చిలికి వన్నె తీసివేసిన తర్వాత మిగిలేది మజ్జిగ భోజనం తర్వాత

మన ఆరోగ్యం మన దేశంలో తీసుకోతగిన ఉత్తమమైనది మజ్జిగ. రెండవ ఉత్తమైన పదార్థం పాలు. ఆయా ఋతువుల్లో వచ్చే పళ్లరసాలు మాత్రమే తీసుకోవలెను. ఆ ఋతువుకి విరుద్ధమైనవి కోల్డ్ స్టోరేజ్లో నిలువ వుంచి తెచ్చినవి మంచిదికాదు, పరమవిషం.

వీటిని మీరు చప్పరిస్తూ త్రాగితే ఎక్కువ లాలాజలం పొట్టలోనికి వెళుతుంది. దానివల్ల ఆమ్లాలు న్యూట్రల్ అవుతాయి. అప్పుడు మనం జీవితాంతం ఏ రోగాల భారిన పడకుండా ఆరోగ్యంగా జీవించవచ్చును. మనమే కాదు జంతువులను గమనిస్తే కూడా ఈ విషయం మరింత అర్థమౌతుంది. పిచ్చుకని చూడండి. నీటిని చప్పరిస్తూ ఒక్కొక్క గుటక త్రాగుతుంది. అలాగే కుక్కలు, ఇంకా మరిన్ని జంతువులు ఈ నియమాన్నే అనుసరిస్తాయి. గనుకనే అవి ఎలాంటి గుండె కానీ మధుమేహం | అదిక బరువు వంటి సమస్యలు వాటికి ఉండవు. కనుక మనం కూడా నీటిని చప్పరిస్తూ త్రాగుదాం. ఇది ఎంతో శ్రేయష్కరం.

ఆరోగ్య మస్తు యూట్యూబ్ ఛానల్ లో మరెన్ని హెల్త్ టిప్స్ చూడండి 👇

https://youtu.be/gOGXWYSZqDU?si=kM7qZkkljT6htu2p


Dr. M Gouthami, BAMS MD(AYU)

D/o Dr. M Ashok Vardhan Reddy MD(AM)

N.L.P Basic Practitioner

Life skills Coach

Impact certified motivational trainer

Secunderabad      

8500204522

Post a Comment

0 Comments