వీడియో గేమ్ వృద్ధులకు మంచిదే..! జ్ఞాపక శక్తిని పెంచడంలో సహాయం
తరచూ స్క్రీన్ ముందు గడపడం, ముఖ్యంగా గంటల తరబడి వీడియో గేమ్స్ ఆడటం, చూడటం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పెద్దలు చెబుతుంటారు. కానీ అది అందరికీ వర్తించదని యూనివర్సిటీ ఆఫ్ అయోవా నిర్వహించిన ఒక పరి శోధనలో వెల్లడైంది. పిల్లలు, యుక్త వయస్కులు వీడియో గేమ్స్ అడిక్షన్ వల్ల నష్టపోతుండవచ్చు. కానీ 50 ఏండ్లు పైబడిన వృద్ధులకు మాత్రం ఇది మేలు చేస్తుందని పేర్కొన్నది. పరిశో ధనలో భాగంగా రీసెర్చర్స్ 'డోర్ టూర్' అనే గేమ్ ఉపయోగించారు. ఇది మెంటల్ ప్రాసెసింగ్ స్పీడ్ అండ్ స్కిల్స్ ను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో పరిశీలించగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
ఆలోచనల్లో వేగం...
వీడియో గేమ్ పిల్లల ఆరోగ్యంపై, జ్ఞాపక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుందేమో కానీ.. వృద్ధులకు మాత్రం మేలు చేస్తుందని పరిశోధ కులు అంటున్నారు. ముఖ్యంగా 50 సంవత్స రాలు పైబడిన వృద్ధులు కేవలం 10 గంటలు మెదడును ఉత్తేజపరిచే (Brain-stimulat-ing) వీడియో గేమ్స్ ఆడితే, జ్ఞాపకశక్తి, ఆలోచ నల్లో వేగం మెరుగుపడుతుందని కనుగొన్నారు. అంతేకాదు.. ఆసక్తికమైన వీడియో గేమ్ అధిక వయసుగల వారిలో మెదడు వృ ద్ధాప్యాన్ని దాదాపు 7 నుండి 10 సంవత్సరాల వరకు ఆలస్యం చేస్తుందని కూడా అధ్యయనంలో తేలింది. ఎందుకంటే బ్రెయిన్-స్టిమ్యులేటింగ్ వీడియో గేమ్ ఆడినవారు ఒక సంవ త్సరం. తర్వాత కూడా కాగ్నిటివ్ స్కిల్స్లో మె రుగుదల చూపారు. అంటే ఇది సాధారణ క్రాస్వర్డ్ పజిల్స్ కంటే మరింత ప్రభావవంతమైనది.
లెర్నింగ్ సామర్థ్యం పెరుగుతుంది...
బ్రెయిన్ స్టిమ్యులేటింగ్ గేమింగ్ వాస్తవానికి మెదడుకు శిక్షణ ఇవ్వడం ద్వారా డోపమైన్ స్థాయిలను పెంచుతుంది. ఆ సందర్భంలో అది వృద్ధుల్లో రియాక్షన్ టైమ్ను షార్ప్ చేస్తుంది. మెదడులోని లెర్నింగ్ ఏరియాల్లో గ్రే మ్యాటర్ను వృద్ధి చేస్తుంది. ఇటీవలి అధ్యయనాలు సైతం బ్రెయిన్ HQ వంటి కాగ్నిటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా అసెటైల్కోకోలినా యిలను 2.3% పెంచుతాయని, ఇది సాధారణ వృద్ధాప్యంలో దశాబ్దకాలంగా జరిగే డిక్లైన్ను రివర్స్ చేస్తుందని చూపించాయి. కాబట్టి ఇది విషయాలపట్ల శ్రద్ధను, నేర్చుకునే సామర్థ్యాన్ని, జ్ఞాపక శక్తిని మెరుగు పరుస్తుంది.

0 Comments