GET MORE DETAILS

03-03-2024 - ఆదివారం రాశి - ఫలితాలు

03-03-2024 - ఆదివారం రాశి - ఫలితాలు

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈



మేషం:

చిన్ననాటి మిత్రుల  కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి.  వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

---------------------------------------

వృషభం:

వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు ముందుకు సాగుతారు. బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

---------------------------------------

మిధునం:

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాల నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. మిత్రులతో ఆర్థిక విషయంలో విబేధాలు కలుగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి.

---------------------------------------

కర్కాటకం:

భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారమున నష్టాలు భర్తీ అవుతాయి.

---------------------------------------

సింహం:

సోదరులతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. బందు మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. స్థిరస్తి వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్య సిద్ది కలుగుతుంది.

---------------------------------------

కన్య:

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించటం మంచిది. చిన్ననాటి మిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి.

---------------------------------------

తుల:

వృత్తి వ్యాపారాలు స్థిరంగా రాణించవు. పాత రుణాలు తీర్చడానికి నూతన  రుణ ప్రయత్నాలు  చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి  ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు అధికమౌతాయి.

---------------------------------------

వృశ్చికం:

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు హోదాలు పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘ కాలిక వివాదాల నుండి బయట పడతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

ధనస్సు:

కీలక  వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల  ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది.  ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం   ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

మకరం:

ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు కలసివస్తాయి. గృహమున  శుభకార్యాలు నిర్వహిస్తారు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి అవుతాయి. ఉద్యోగమున ఉత్సాహకర  వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా  సాగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

కుంభం:

నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.   కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అతి కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు.

---------------------------------------

మీనం:

విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.  దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.  ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో  దైవ సేవకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి.

Post a Comment

0 Comments