మకర రాశిలో రవి, శుక్ర, బుధ, ఉచ్ఛ కుజుడు సంచారం. ఆరు రాశులకు రాజయోగం!
మకర రాశిలో రవి, శుక్ర, బుధ, ఉచ్ఛ కుజుడు సంచారం చేస్తుండడం, పైగా ఈ గ్రహాలన్నీ చంద్రుడికి చెందిన శ్రవణ నక్షత్రంలో కలవడం వల్ల ఆరు రాశుల వారికి దశ తిరగబోతోంది. మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశులకు ఈ గ్రహ యుతి వల్ల ఫిబ్రవరి 16లోగా జీవితం అనేక సానుకూల మలుపులు తిరిగే అవకాశం ఉంది.వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగాలు పడతాయి. ప్రముఖుల స్థాయికి ఎదగడం జరుగుతుంది. ఆదాయం విశేషంగా అభివృద్ధి చెంది, ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పట్టి మానసిక ప్రశాంతత లభిస్తుంది. గృహ, వాహన యోగాలు పట్టడంతో పాటు ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది.
మేషం ఈ రాశికి దశమ స్థానం బాగా బలపడినందువల్ల కెరీర్ పరంగా అనేక విధాలైన శుభ యోగాలు, అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభంతో పాటు ఆకస్మిక అధికార యోగం పట్టే సూచనలు కూడా ఉన్నాయి. రావలసిన సొమ్ము, రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము, బాకీలు, బకాయిలు చేతికి అందుతాయి. తండ్రి వైపు నుంచి ఊహించని ధన లాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ చాలావరకు పరిష్కారమవుతాయి.
వృషభం ఈ రాశికి భాగ్య స్థానంలో శుభ గ్రహాల యుతి చెందినందువల్ల అంచనాలకు మించి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా గుర్తింపు లభిస్తుంది. అత్యున్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
కర్కాటకం ఈ రాశికి సప్తమ స్థానంలో నాలుగు ప్రధాన గ్రహాలు కలవడం వల్ల తప్పకుండా గృహ యోగం పడుతుంది. ఆస్తిపాస్తుల సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడతాయి.
తుల ఈ రాశికి చతుర్థంలో గ్రహ యుతి జరగడం వల్ల సిరిసంపదలు వృద్ది చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులను చేపడతారు. నిరుద్యోగుల విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు సాధి స్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.
ధనుస్సు ఈ రాశికి ధన స్థానంలో ప్రధాన గ్రహాల యుతి వల్ల, వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదిగిపోతారు. సంపన్నులతో సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగంలో సీనియర్లను దాటిపోతారు. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని స్థాయిలో డిమాండ్ పెరుగుతుంది. వీరు చేపట్టే ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతమవుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది.
మకరం ఈ రాశిలో కుజుడు ఉచ్ఛపట్టడంతో పాటు మూడు రాజయోగ గ్రహాలు కలవడం వల్ల ఈ రాశి వారికి మహా భాగ్య యోగం పట్టే సూచనలున్నాయి. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థికంగా బాగా శక్తిమంతం అవుతారు. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.
.jpeg)
0 Comments