గాయత్రి మంత్రము గురించి మహాత్ములు చెప్పినవి
– గాయత్రి మంత్రమును జపించకుండా ఇతర మంత్రములను జపించుట భోజనానికి సిద్ధంగా ఉన్న భోజనాన్ని వదిలి ఆడుక్కుని తినటం లాంటిది.
'బ్రహ్మయే గాయత్రి గాయత్రియే బ్రహ్మ'
'బ్రహ్మయే గాయత్రి గాయత్రియే బ్రహ్మ'
🚩🚩🚩
– బంగారపు రంగులో ఉన్న సూర్యబింబము మధ్యలో గాయత్రీ మాతను ధ్యానిస్తూ మంత్రజపం చేసిన యడల శీఘ్రముగా జనన మరణాల నుండి ముక్తుడవుతాడు.
🚩🚩🚩
– గాయత్రీ మోక్ష విద్య తెలుపు రంగు తేజస్సుతో ప్రకాశించి బుద్ధిని పవిత్రంచేస్తుంది.
🚩🚩🚩
– ముల్లోకాలకు జ్ఞానమును ప్రసాదించేసి గాయత్రీ దేవతయే వేదమాత. గాయత్రిని మించిన మంత్రము లేదు.
🚩🚩🚩
– ఒక త్రాసులో వేదాలు మరియు గాయత్రి మంత్రమును ఉంచినచో గాయత్రి వైపే త్రాసు మొగ్గును.
🚩🚩🚩
– 'న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పర దైవతం'
🚩🚩🚩
– గాయత్రీ మంత్రమును విడిచి పెట్టకుండా జపించే వారు దుఃఖం పొందరు.
🚩🚩🚩
– సూర్యుని ఎదుట ఎనిమిది వేల గాయత్రీ జపం చేసిన యడల సర్వ పాపములనుండి విముక్తుడవుతాడు.
🚩🚩🚩
– గాయత్రీని జపించే వారిని మాత్రమే పితృకార్యాలకు ఆహ్వానించాలి.
🚩🚩🚩
– గాయత్రిని జపించు వారి పాపాలు నశిస్తాయి.
🚩🚩🚩
– నిత్యం సంధ్యలలో గాయత్రీ ఉపాసన చేసే వారికి దోషములు కలుగవు.
🚩🚩🚩
– నరక నివారణకు గాయత్రిని మించిన మంత్రము లేదు.
🚩🚩🚩
– అన్నముతో జలముతో సమానమైన దానం, అహింసతో సమానమైన తపస్సు గాయత్రి.
🚩🚩🚩
– గాయత్రీ సమస్త దేవతా స్వరూపము. ఆమె ఉన్న చోట శ్రీమన్నారాయణుడు నివసిస్తాడు.
🚩🚩🚩
– మూర్ఖుడు కూడా గాయత్రిని జపించిన ఉన్నత స్థితికి చేరును.
🚩🚩🚩
– గాయత్రీ జపం ఆత్మోన్నతి, రోగనాశనం, ఆపదనాశనం చేస్తుంది.
🚩🚩🚩
– గాయత్రి మహిమను వర్ణించుటకు మానవ సామర్థ్యం సరిపోదు.
