గాయాలు, పుండ్లు అయిన వారు పప్పు తినవచ్చా? తింటే చీము పడుతుందా?
Q: గాయాలు, పుండ్లు అయిన వారు పప్పు తినవచ్చా? తింటే చీము పడుతుందా? నిజమెంత?
Ans: గాయాలు, పుండ్లు అయినప్పుడు భేషుగ్గా పప్పు తినవచ్చు.
గాయాలు, పుండ్లు అయినప్పుడు పప్పు తింటే చీము పడుతుందని అనడంలో ఏమాత్రం నిజం లేదు. అదంతా వట్టి అపోహ మాత్రమే. నిజానికి అలాంటి పరిస్థితిలో పప్పు తినడం చాలా మంచిది.
ఎందుకంటే పప్పులో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అవి గాయాలు, పుండ్లు త్వరగా మానేందుకు సహాయపడతాయి. అందువల్ల గాయాలు, పుండ్లు ఉన్నప్పుడు పప్పును నిరభ్యంతరంగా తినవచ్చు.
కాబట్టి పప్పు తింటే చీము పడుతుందని అనుకోవడం తప్పు. భేషుగ్గా పప్పు తినవచ్చు.
అయితే చీము ఎందుకు పడుతుంది?
చీము పడటానికి పలు కారణాలు ఉన్నాయి:
- గాయాలు లేదా పుండ్లు రోజూ శుభ్రం చేయకపోతే ఇన్‌ఫెక్షన్ అవుతుంది.
- సూక్ష్మక్రిములతో పోరాటంలో తెల్ల రక్తకణాలు చనిపోతాయి – అవే చీముగా కనిపిస్తాయి.
- దుమ్ము, ధూళి ఎక్కువగా పడడం వల్ల ఇన్‌ఫెక్షన్ పెరుగుతుంది.
- గాయాలు శుభ్రంగా ఉంచకపోతే మానడానికి ఆలస్యం అవుతుంది.
చీములో ప్రధానంగా చనిపోయిన కణాలు, ఇతర కణజాలం మరియు తెల్ల రక్త కణాలు ఉంటాయి.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే – చీముకు, పప్పుకు ఎలాంటి సంబంధం లేదు. గాయాలు, పుండ్లు ఉన్నవారు నిరభ్యంతరంగా పప్పు తినవచ్చు.
