Ads Area

అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం : ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తెరిచినట్లే

0

అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం

ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తెరిచినట్లే!

హిందూ పండుగలలో అక్షయ తృతీయకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకునే ఈ పండుగ అత్యంత శుభప్రదమైనది. ఈ రోజు బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం అదృష్టమని భక్తుల నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది ఏర్పడనున్న అరుదైన అక్షయ యోగం వల్ల కింద పేర్కొన్న నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగనున్నాయి.

♈ మేష రాశి

వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఆర్థిక సమస్యలు తొలిగిపోయి ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది.

♎ తుల రాశి

ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోయి అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు.

♐ ధనస్సు రాశి

జీవితంలోకి కొత్త వెలుగులు వస్తాయి. అనుకున్న పనులు ఎలాంటి శ్రమ, టెన్షన్ లేకుండా త్వరగా పూర్తవుతాయి. చాలా ఆనందంగా గడుపుతారు.

♒ కుంభ రాశి

లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అన్ని పనుల్లోనూ మీదే పైచేయి అవుతుంది. ఈ రోజు మీరు బంగారం లేదా వెండి కొనుగోలు చేసే అవకాశం ఉంది.

✨ శుభమస్తు - అక్షయ తృతీయ శుభాకాంక్షలు ✨

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area